వస్తున్నా మీకోసం: సమావేశాలకు చంద్రబాబు దూరం

ఈ నెల 30వ తేది నుండి అంటే శుక్రవారం ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ కోసమే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాదయాత్రతో బిజీగా ఉన్న చంద్రబాబు రావాల్సిన అవసరం కూడా ఏమీ లేదని టిడిపి నేతలు భావిస్తున్నారు. పాదయాత్ర బాగా సాగుతోందని, డిస్టర్బ్ చేయకుండా ఉండడటమే ఉత్తమమని నేతలు చెబుతున్నారు.
చంద్రబాబు రాకపోయినప్పటికీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కానున్నారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మెదక్ జిల్లా పాదయాత్రలో ఉన్న చంద్రబాబుతో పార్టీ సీనియర్ నేతలు చర్చించారు. కాగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ కోసమే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నందున అవిశ్వాస తీర్మానం పెట్టే యోచన ప్రస్తుతానికి లేదని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు.












Click it and Unblock the Notifications