వైయస్ జగన్ పార్టీ ఢీలా: 'రెగ్యులర్' పైనే కొండంత ఆశ

జగన్ బెయిల్ పిటిషన్ తీర్పు వచ్చే వరకు జగన్ పార్టీలో ఉత్కంఠ కనిపించింది. తిరస్కరించడంతో ఒక్కసారిగా వారు ఢీలా పడ్డారు. జగన్ బెయిల్‌ను తిరస్కరించడంతో ఆ పార్టీ నేత జనక్ ప్రసాద్ బుధవారం స్పందించారు. జగన్ బెయిల్ పిటిషన్ పైన కోర్టు తీర్పు దురదృష్టకరమని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థపైన తమకు నమ్మకముందని, బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియదన్నారు.
ఈ నెల 30న జగన్‌కు ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇక ఈ నెల 30కి వాయిదా పడిన రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ పైన కొండంత ఆశలు పెట్టుకుంది. జగన్ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications