ఆలోచన లేదన్న టిడిపి: జగన్ సవాల్‌పై బాబు వెనక్కి!

అందుకు తెలుగుదేశం పార్టీ కూడా ఘాటుగానే సమాధానం చెప్పింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సభా వ్యవహారాలు తెలియకుండా మాట్లాడుతున్నారని, సమావేశాలు జరగకుండా అవిశ్వాస తీర్మానం ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ తర్వాత చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లాలో తన పాదయాత్ర ఉన్న సమయంలో అవసరమైతే ప్రజల కోసం అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించారు.
దీంతో ఒక్కసారిగా అవిశ్వాసం వేడి రాజుకుంది. బాబు అవిశ్వాసం ప్రకటన చేసినప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం పలుమార్లు సవాళ్లు విసురుతూ వస్తోంది. కిరణ్ ప్రభుత్వానికి అండగా నిలబడడం లేదని బాబు చెప్పదల్చుకుంటే అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు.. చేస్తున్నారు. ఎల్లుండి నుండి సమావేశాలు ప్రారంభమవుతున్నందున టిడిపి అవిశ్వాసం పెడుతుందా అనే చర్చ ప్రధానంగా జరుగుతోంది.
ఇలాంటి సమయంలో టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అవిశ్వాసంపై నోటీసులు ఇచ్చే ఆలోచన లేదని చెప్పారు. ఆయన మెదక్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సభ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లుపై జరుగుతుందని, అందుకే అవిశ్వాస నోటీసు ఆలోచన ఇప్పుడు లేదని, అప్పటికప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చునని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లును తాము స్వాగతిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications