'ఆధారాలున్నాయి, జగన్ తప్పించుకోవడం సాధ్యంకాదు'

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చట్టం చట్రంలో ఇరుక్కున్నారని, దాని నుండి ఆయన బయటపడటం సాధ్యం కాదని సిబిఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ నేరాలు రుజువు చేసేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటి ద్వారా ఆతను బయటపడటం ఆసాధ్యమని ప్రముఖ తెలుగు దిన పత్రికలో కథనం వచ్చింది.

కథనం ప్రకారం... తగిన ఆధారాలు లేకుంటే సిబిఐ ఏ కేసునూ విచారణకు స్వీకరించదని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి. ఆధారాలు లేని మాటే నిజమైతే జగన్ ఇన్ని రోజులు జైల్లో ఉండేవాడు కాదని, కోర్టులు కళ్లు మూసుకొని ఆధారాలు విచారించవని, ఆధారాలు ఉన్నందువల్లే అతనికి బెయిల్ రావడం లేదని, ఏ తప్పు చేయని అతడు బయటకు వస్తాడనే ప్రచారం కేవలం వారి ధైర్యాన్ని పెంచుకునేందుకు, మా స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఆడుతున్న మైండ్ గేమ్ మాత్రమేనని అంటున్నారు.

తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని చెబుతున్నారు. ఈ కేసు హైదరాబాద్ జెడి మాత్రమే చూసుకుంటున్నారని, కేంద్ర కార్యాలయం నుండి జోక్యం లేదని, జెడి ఎవరి ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదని తెలిపారు. సిబిఐ కేసుల్లో 70 శాతం నేరాలు రుజువయ్యాయని చెప్పారు. కాంగ్రెసు ప్రమేయం అనే ఆరోపణలు తప్పుదోవ పట్టించేందుకే అని చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా తాము తప్పు చేయలేదనే చెప్పుకుంటారని చెప్పారు.

జగన్ రాజకీయ నాయకుడు కాబట్టి పార్టీని కాపాడుకునేందుకు తప్పు చేయలేదని చెప్పుకోవడం సహజమేనని వ్యాఖ్యానించారు. జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డి పాత్రను రుజువు చేసేందుకు తమ వద్ద అవసరమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అక్రమాస్తుల కుంభకోణంలో ఆయన పాత్రను రుజువు చేసేందుకు తగినన్ని ఆధారాలున్నాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+