సిఎంతో వైరం నిజమే, పెద్దిరెడ్డి రాజీనామా పర్సనల్: జెసి

JC Diwakar Reddy
హైదరాబాద్: మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌కి మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని మాజీ మంత్రి, తాడిపత్రి కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం అన్నారు. ప్రతి మంత్రివర్గంలో ప్రతి విషయంపై బేధాభిప్రాయాలు ఉంటాయని, అది సాధారణ విషయమే అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని అభ్యంతరాలు తాము లేవనెత్తామన్నారు.

మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామా వ్యవహారం ముఖ్యమంత్రి చూసుకుంటారని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని చెప్పారు. తెలంగాణ విషయంలో అధిష్టానం మాటే మా మాట అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎలా చెబితే అలా వింటామన్నారు. అమ్మ(సోనియా గాంధీ) చిత్తమే మా చిత్తం అని జెసి ఈ సందర్బంగా చెప్పారు.

హంద్రీనీవా వరద నీటి జలాలనే తాము వినియోగించుకుంటున్నామని చెప్పారు. డిఎల్‌తో ముఖ్యమంత్రికి విభేదాలు ఉన్నప్పటికీ మిగిలిన మంత్రులతో ఎవరితోనూ లేవన్నారు. నగదు బదలీ పథకాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమలు చేయలేరని మాత్రమే తాము చెప్పామని అన్నారు.

నగదు బదలీ పథకం కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడుతుందన్నారు. నాయకత్వ మార్పు సోనియా గాంధీ చేతుల్లో ఉందన్నారు. కిరణ్ పాలన బాగుందని, ఐదేళ్లు పూర్తి చేసుకుంటే అభినందిస్తానని చెప్పారు. హంద్రీనీవా యాత్ర ముగింపు సభకు తాను వెళ్లడం లేదని, వ్యక్తిగత పనుల వల్లే వెళ్లడం లేదన్నారు. చాగల్లు రిజర్వాయర్ గురించి తాను సిఎంకు చెప్పానని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించానన్నారు. సీమకు వస్తున్నది వరద నీరే కానీ మిగిలు నీరు కాదన్నారు.

కాగా హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా తాడిపత్రి నియోజకవర్గానికి నీటిని కేటాయించాలని జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. మరోవైపు పిసిసి చీఫ్ బోత్స సత్యనారాయణ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. పాలసేకరణ నిలిపివేతపై చర్చించారు. మరోవైపు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+