రాధాకృష్ణపై పరువు నష్టం దావా: తప్పుకున్న జడ్జి

విచారణ కోసం బెంచీ మీదికి వచ్చిన రామమోహన్ రావు మంగళవారం న్యాయవాది ఎం కృష్ణారావు గతంలో తనకు జానియర్‌గా పనిచేశాడనే విషయాన్ని గుర్తించారు. రిజిస్ట్రీలో నాట్ బిఫోర్ మీ న్యాయవాదులు అని నోట్ చేసి ఉండడాన్ని చూశారు. రాధాకృష్ణ తరపున వాదించడానికి కృష్ణారావు వాదిస్తున్నారు.
నాట్ బిఫోర్ మీని దుర్వ్లినియోగం చేస్తున్నారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు నుంచి రామమోహన్ రావు తప్పుకోవడానికి నిర్ణయించుకున్నారు. తన జూనియర్ ఈ కేసు తీసుకోవడానికి అంగీకరించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేసు విచారణను మరో న్యాయమూర్తికి అప్పగించాలని జస్టిస్ రామమనోహర్ రావు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌కు రెఫర్ చేశారు.












Click it and Unblock the Notifications