విలీనం చేస్తానని బురదజల్లకు: కెసిఆర్‌కు పాల్వాయి

ఇప్పుడు కెసిఆర్ తమ పార్టీ పైన బురద జల్లాలని చూడటం మంచిది కాదన్నారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పార్టీని బేషరతుగా విలీనం చేస్తానని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు తమను విమర్శించవద్దన్నారు.
సోనియా గాంధీకి తెలియకుండా ఈ రోజుల్లో పిట్ట కూడా లేవదని, కాబట్టి కెసిఆర్‌ను ఎవరు పిలిచారు, ఎలా పిలిచారన్నది ఇప్పుడు అప్రస్తుతమన్నారు. కాగా సోమవారం వాయలార్ రవి మాట్లాడుతూ... కెసిఆర్‌ను ఎవరు పిలిచారో తనకు తెలియదని చెప్పిన విషయం తెలిసిందే. చర్చల కోసం కె.చంద్రశేఖర రావును ఎవరు పిలిచారో తనకు తెలియదని వాయలార్ అన్నారు. వాయలార్ రవి వ్యాఖ్యలపై తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications