జగన్, విజయసాయిరెడ్డే సూత్రధారులు: హరీష్

మీడియా కథనాల ప్రకారం - ఆర్థిక లావాదేవీలు, ఇతర కీలక అంశాలకు సంబంధించిన సూత్రధారులు జగన్, సాయిరెడ్డి మాత్రమే అని, తాను సాంకేతిక అంశాలను మాత్రమే చూసుకునే వాడినని హరీశ్ తెలిపారు. జగతి, ఇతర కంపెనీల్లో ప్రధాన వాటాలు జగన్‌వేనని, ఏ నిర్ణయమైనా జగన్‌ను సంప్రదించిన తర్వాత విజయసాయిరెడ్డి తీసుకునేవారని అన్నారు.
విజయసాయి రెడ్డి జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ పదవికి అధికారికంగా మాత్రమే రాజీనామా చేశారు. అనధికారికంగా మాత్రం ఆయన ఇప్పటికీ వైస్ చైర్మనే అని కామర్తి వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారులు సాయిరెడ్డి ద్వారానే వచ్చారుని చెప్పారు. విజయసాయిరెడ్డి జరిపిన ఆర్థిక లావాదేవీల ఫలితం పొందింది అంతా జగనే అని హరీశ్ చెప్పారు.
జగతి వ్యవహారాల్లో మరో కీలక పరిణామమైన షేర్ల కేటాయింపుపైనా సిబిఐ హరీష్ కామర్తిని ఆరా తీసింది. రూ.10 విలువైన షేరు ప్రీమియం రూ.350గా ఎవరు నిర్ణయించారని ప్రశ్నించగా..జగన్‌తో మాట్లాడిన తర్వాత సాయిరెడ్డే నిర్ణయించారని హరీశ్ చెప్పారు. 2007 ఆగస్టు, అక్టోబర్ మధ్య అది జరిగిందని అన్నారు. జనని సహా ఆయా కంపెనీల షేర్ల ప్రీమియంను కూడా వారిద్దరే నిర్ణయించారని తెలిపారు.












Click it and Unblock the Notifications