బారులో టెక్కీ హత్య: ఒకరిని మరొకరిగా భావించి..

Software Engineer killed
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను దుండగులు అకారణంగా హత్య చేశారు. తాము చంపాల్సిన వ్యక్తి అతనే భావించి, టెక్కీ హత్య చేశారు. నిజానికి వారు చంపాలనుకున్నది మరొకరిని. వేలాచరిలోని తస్మాక్ షాప్‌లో పది మందితో కూడిన ఓ గుంపు 45 ఏళ్ల టెక్కీని హత్య చేసింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది.

గ్యాంగ్ మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో తస్మాక్ బారులోకి ప్రవేశించి, బారును తమ ఆధీనంలోకి తీసుకుని, ఫర్నీచర్‌ను ఇష్టారాజ్యంగా ఎత్తి పారేశారు. బిల్లింగ్ కౌంటర్‌ వద్ద నిలబడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్ కులకర్ణిపై దాడి చేశారు. కులకర్ణి మాట్లాడడానికి ప్రయత్నిస్తుండగా ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దాంతో కులకర్ణి తీవ్రంగా గాయపడ్డాడు.

కులకర్ణి ఎకట్టుతంగళ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. అతని కుటుంబం షోలింగనల్లూర్‌లో నివసిస్తోంది. కులకర్ణి మరణించగానే గ్యాంగ్ పారిపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసు జాయింట్ కమిషనర్ (దక్షిణ చెన్నై) తిరుగ్నానం, అడియార్ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఆర్ సుధాకర్, సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఎవరో అనుకుని గ్యాంగ్ కులకర్ణిని చంపిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రతీకారంతోనే గ్యాంగ్ హత్యకు ఒడిగట్టిందని, అయితే కులకర్ణికి ఏ విధమైన నేరనేపథ్యం లేదని, అందువల్ల మరొకరిని చంపాలనుకుని గ్యాంగ్ కులకర్ణిని చంపి ఉంటుందని పోలీసులు అంటున్నారు.

బార్ లీజు విషయంలో వివాదం చోటు చేసుకుందని, ఇటీవల బార్ యాజమాన్యం మారిందని, దీంతో వివాదం తలెత్తిందని, హత్య వెనక కారణం అదే ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+