వైయస్ హింసకు కంట నీరు, వైశ్యులే అన్నాం: ఈటెల

2009 డిసెంబర్ 9న రాత్రి పదకొండున్నర గంటలకు కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే తెలంగాణ యావత్తూ ఆనందంలో మునిగిపోయిందని, ఆ తర్వాత రోజు తాము తెలంగాణ కోసం సహకరించారని అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వద్దకు థ్యాంక్స్ చెప్పేందుకు వెళ్లామన్నారు.
రోశయ్య వద్దకు వెళ్లి నాడు తమిళనాడు నుండి ఆంధ్రను వేరు చేయడానికి ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న మీరు వైశ్యులు అని, కేంద్రమంత్రి చిదంబరం కూడా వైశ్యులే అని గుర్తు చేశామని అన్నారు. ఆయనకు థ్యాంక్స్ చెప్పామన్నారు. ఆ తర్వాత చంద్రబాబు, చిరంజీవికి థ్యాంక్స్ చెప్పామన్నారు. అయితే ఆ తర్వాత వీరే తెలంగాణను అడ్డుకున్నారని విమర్శించారు.
తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలందరం రాజీనామా చేసి ఆ పదవులను కాంగ్రెసు పార్టీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇంకా కాంగ్రెసు మోసపూరిత విధానాలనే అవలంభిస్తోందన్నారు. తెలంగాణ సాధనకు పదునైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. భవిష్యత్తు కార్యాచరణలో ప్రజలందర్నీ భాగస్వాములు చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దిశగా వెళ్తామన్నారు.












Click it and Unblock the Notifications