హిట్లర్, బాబు పుట్టింది ఒకేతేది, 4-20అలా: విజయమ్మ

ఇప్పుడు మళ్లీ వాగ్ధానాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమంటే డొంక తిరుగుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బాబు హయాంలో ఐటి రంగంలో హైదరాబాద్ దిగజారిపోయిందన్నారు. అబద్దాలను పదే పదే ప్రచారం చేసి నిజమని నమ్మించేందుకు గోబెల్స్ అనే మంత్రిని ప్రత్యేకంగా నియమించుకున్న హిట్లర్ జన్మదినం, రాష్ట్రంలో అదే పనిగా అబద్దాలాడుతున్న చంద్రబాబు పుట్టిన రోజు ఒకటేనని ఆమె అన్నారు.
ఇద్దరూ 4వ వెల 20వ తేదినే పుట్టారని, 4, 20లను కలిపితే వచ్చేది 420 అని, ఇది చంద్రబాబుకు బాగా సరిపోతుందన్నారు. బాబుకు చిత్తశుద్ధి, విశ్వసనీత లేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారన్నారు. హైదరాబాదుకు విజయమ్మ చేసిందేమీ లేదన్నారు. 1956 నుంచే హైదరాబాదుకు పేరు ఉందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వందేళ్ల చరిత్ర ఉందన్నారు.
హైదరాబాదుకు చాలా సంస్థలను కేంద్రమే తెచ్చిందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఐటి అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెసు టిడిపిలు కలిసి తన తనయుడు వైయస్ జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. కేసులో కోర్టు విచారణకు ఆదేశించినప్పుడు జగన్ 52వ ముద్దయిగా ఉన్నాడని, సిబిఐ ప్రభుత్వం అనే స్థానంలో వైయస్ రాజశేఖర రెడ్డి పేరును చేర్చిందన్నారు.
టిడిపిలోకి కృష్ణ యాదవ్
మెదక్ జిల్లాలో చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర సమయంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications