ఇడుపులపాయలో నేలమాళిగ: దేవినేని, గవర్నర్ క్లాస్

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వ్యాఖ్యలు సరికావన్నారు. విజయమ్మ ఆరోపణల్లో, మాటల్లో ఎలాంటి నిజం లేదన్నారు. చంద్రబాబు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపై పోరాటం చేశారన్నారు. ఐటి అభివృద్ధి వైయస్ హయాంలో జరిగిందనడం విడ్డూరంగా ఉందన్నారు. ఐటి ఎవరి ద్వారా అభివృద్ధి అయిందో ప్రజలకు తెలుసునన్నారు.
గవర్నర్‌ను కలిసిన టిడిపి నేతలు
తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మంత్రి ధర్మాన ప్రసాద రావును సిబిఐ విచారణకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని తాము గవర్నర్‌ను కోరనట్లు చెప్పారు. తమ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారని, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సూచించాలని చెప్పారన్నారు.
కాగా గవర్నర్ నరసింహన్ తెలుగుదేశం పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. గవర్నర్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి గూఢచారిగా పని చేస్తున్నారని, గాంధీ భవనంలో గది తీసుకోవాలని ధ్వజమెత్తారు. దీనిపై ఆయన వారికి క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications