డబ్బు మదంతో యాత్ర: జగన్‌పై బొత్స, కిరణ్ సైలెన్స్!

Botsa Satyanarayana
అనంతపురం: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆయన పేరు చెప్పకుండా నిప్పులు చెరిగారు. మంత్రి రఘువీరా రెడ్డి చేపట్టిన భగీరథ విజయ యాత్ర ఈ రోజుతో జీడిపల్లి జలాశయం వద్ద ముగిసింది. యాత్ర 12 రోజుల పాటు 240 కిలోమీటర్లు సాగింది. జీడిపల్లిలో ఏర్పాటు చేసిన ముగింపు సభకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స పలువుర హాజరయ్యారు.

ఈ సందర్భంగా బొత్స... జగన్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు. కొందరు దోచుకున్న డబ్బును దాచుకునేందుకు పాదయాత్రలు చేస్తున్నారని షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఉద్దేశించి అన్నారు. కానీ రఘువీరా రెడ్డి యాత్ర మాత్రం సీమ రైతుల్లో ఆత్మస్థైర్యం నింపిందన్నారు. కొందరు జెండాల పేరు, జెండాలో ఉన్న గుర్తుల పేరు, అందులో ఉన్న పథకాలు ఎవరివో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని వైయస్సార్ కాంగ్రెసును ఉద్దేశించి అన్నారు. పార్టీ పూర్తి పేరు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారన్నారు.

డబ్బు మదంతో కొందరు ఉన్నారని, వారు అధికారంలోకి వస్తే గతంలో దోచుకున్నట్లుగానే రాష్ట్రాన్ని దోచుకుంటారని విమర్శించారు. కొందరు ఈ ప్రాజెక్టు రాదని చెప్పారని, కానీ కాంగ్రెసు ప్రభుత్వం దానిని చేసి చూపించిందన్నారు. కాంగ్రెసుకు వ్యక్తులు ముఖ్యం కాదని వ్యవస్థ ముఖ్యమన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పారు. రఘువీరా పాదయాత్రలో మూడు లక్షల మంది ప్రజలు పాల్గొన్నారన్నారు. చంద్రబాబు అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నారన్నారు.

పోలవరం, ప్రాణహితలకు జాతీయ హోదా తీసుకు వస్తాం

పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకు వస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీరాం సాగర్, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయన్నారు. 2007లో హంద్రీనీవాను ప్రారంభించామని, 2013లో పూర్తి చేస్తామన్నారు. రానున్న రెండేళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు జలయజ్ఞం ద్వారా ఇవ్వాలన్నది ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ.70వేల కోర్టు ఖర్చు పెట్టిందన్నారు.

కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వలన్నదే తన లక్ష్యమన్నారు. సాధ్యమైనంత త్వరగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. హంద్రీనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. భూములు కోల్పోయిన వారిని ఆదుకుంటామని చెప్పారు. జలయజ్ఢంలో ఇప్పటి వరకు 21 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించామన్నారు. కాగా ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+