24గంటల్లో 28 బృందాలు, చిరు మంచం కింద..: షర్మిల

పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఒక డాన్ అని పార్టీ కేంద్రమంత్రే లేఖ రాసినా ప్రభుత్వం విచారణ చేయట్లేదని విమర్శించారు. ప్రజా సమస్యలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. అవిశ్వాసంపై చంద్రబాబు కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రాలలో కూడా విద్యుత్ సమస్య ఉన్నప్పటికీ వారు ముందస్తుగా కొనుగోలు చేసి అధిగమించారని, మన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందన్నారు.
మహబూబ్ నగర్‌ను దత్తత తీసుకున్న చంద్రబాబు ఈ జిల్లాకు ఏం చేశారని చెప్పారు. కనీసం అల్మట్టీ డ్యాంకు అడ్డుపడి ఉంటే ఆయన దత్తత తీసుకున్న జిల్లాకు కొంతలో కొంతైనా మేలు జరిగేదన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావును విచారణ చేయాల్సిన అవసరం లేదని, ఆయన ఏ తప్పు చేయలేదని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మంత్రివర్గంలోని అమాయకుడైన బిసి మంత్రిని జైలులో పెట్టారన్నారు.
కేంద్రమంత్రి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని గంపగుత్తగా అమ్ముకొని కోట్ల రూపాయలు మంచం కింద దాచుకొని దొరికిపోతే ఆయన మీద ఎలాంటి కేసులు పెట్టలేదని, బొత్స లిక్కర్ డాన్ అని కేంద్రమంత్రి చెప్పినా విచారణ జరిపించరని, బాబు మీద ఎన్ని కేసులు ఉన్నా పట్టించుకోరని... ఎవరిని జైల్లో పెట్టాలి ఎవరిని బయట ఉంచాలనే విషయం కాంగ్రెసు పార్టీయే నిర్ణయిస్తుందట అని ధ్వజమెత్తారు.
ఐఎంజి భారత కేసులో బాబు మీద నెల రోజులలోపు విచారణ చేయాలని కోర్టు.. సిబిఐని ఆదేశిస్తే తమ దగ్గర సిబ్బంది లేరని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అదే జగన్ మీద విచారణకు ఆదేశించిన 24 గంటల్లో అదే సిబిఐ 28 బృందాలను పెట్టి జగన్, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేసిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications