వంద ఎకరాలు ఇస్తా, మార్పు ఉత్త ప్రచారం: రాయపాటి

Rayapati Sambasiva Rao
చిత్తూరు: రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు గురువారం అన్నారు. రాయపాటి ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు చిత్తూరు జిల్లాలోని తిరుమలకు వచ్చారు. శ్రీవారిని ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

2014 వరకు రాష్ట్రంలో నాయకత్వ మార్పు సమస్యే లేదన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి ఆధ్యక్షుడిగా పొత్స సత్యనారాయణ కొనసాగుతారన్నారు. ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ మార్పు కేవలం ఊహాగానాలు, వట్టి ప్రచారాలు మాత్రమేనని కొట్టి పారేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వంద ఎకరాల భూమిని కానుకగా సమర్పించనున్నట్లు రాయపాటి ఈ సందర్భంగా ప్రకటించారు.

కాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను మారుస్తారనే ప్రచారం ఇటీవల జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. అధిష్టానం పెద్దలు మార్పు అంశాన్ని ఖండిస్తూ వచ్చినప్పటికీ మార్పు ప్రచారం మాత్రం ఆగిపోలేదు. అయితే ఇటీవల ఈ ప్రచారానికి తెరపడింది.

స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తాను 2014 వరకు కొనసాగుతానని పలు సందర్భాలలో ప్రకటించారు. అయితే పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మాత్రం తాను నామినేట్ అయిన వ్యక్తిని అని ఢిల్లీ పెద్దలు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పినట్లుగా వింటానని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+