ప్రియుడితో కలిసి అత్తను దురాశతో చంపిన కోడలు

తన అత్త నిద్రపోతుండడం గమనించి సౌజన్య తన ప్రియుడు శ్రీనివాస్‌ను, మరో ఇద్దరిని అక్టోబర్ 13వ తేదీ రాత్రి ఇంటికి పిలిచింది. వారితో కలిసి అత్తను గొంతు నులిమి హత్య చేసింది. మర్నాడు ఉదయం పూటే ఎదురు ఇంట్లో ఉంటున్న తల్లిదండ్రులను పిలిచి ఏడ్వడం ప్రారంభించింది. తన అత్త గుండెపోటుతో మరణించిందని ఆమె సౌజన్య తల్లిదండ్రులకు చెప్పింది.
విషయాన్ని సౌజన్య తల్లిదండ్రులు బంధువులకు, ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న అల్లుడు వన్నల సతీష్‌కు తెలియజేశారు. సతీష్ అక్టోబర్ 19వ తేదీన ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాడు. అప్పటికే 14వ తేదీనే అంత్యక్రియలు పూర్తి చేశారు. భార్య మాటలను సతీష్ నమ్మాడు. ఆ తర్వాత నవంబర్ 2వ తేదీన తన తల్లి ఎటిఎంను చెక్ చేశాడు. అందులో 49 వేల రూపాయలను 14వ తేదీన, మరో 49 వేలు అంతకు ముందు అర్థరాత్రి డ్రా చేసినట్లు తేలింది.
దాంతో సతీష్ తన భార్య కదలికలను గమనించడం ప్రారంభించాడు. ఒంట్లో నలతగా ఉండడంతో భార్యను ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. నాలుగు నెలల గర్భవతి అని తేలింది. సతీష్ గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, భార్యను కలుసుకోనే లేదు. దాంతో సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సతీష్ భార్య సౌజన్యను, ఆమె ప్రియుడు సౌజన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications