నిటీ డిజిటిల్ ఇండియా వోట్స్ డాట్ కామ్ షురూ

పొలిటికల్ డొమైన్‌లో గణాంకాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ప్రజలకు వివరాలను అందించే ఆలోచనలో భాగంగానే ఇది ముందుకు వచ్చింది. ఎన్నికల డేటా ఆన్‌లైన్‌లో చాలా సులభంగా అందే విధంగా రూపొందించారు. క్లిష్టమైన పద్ధతిని నివారించారు. భారత ఎన్నికల సమాచారం ఓపెన్ సోర్స్గ్గ్‌గా ఉండాలన్నదే ఇండియావోట్స్ డాట్ కామ్ ఉద్దేశ్యం.
బారత ఎన్నికల సమాచారం సులభంగా అందుబాటులో ఉండాలనే తమ సొంత ఆకాంక్ష నుంచి ఇండియా వోట్స్ ఆవిర్భవించిందని, ఎన్నికల సమాచారానికి భాగస్వామ్య ప్రజాతంత్ర వేదిక అవసరం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు అవసరమని భావించామని నిటీ డిజిటల్ సిఇవో వీర్‌చంద్ బోత్రా చెప్పారు.
భారతదేశ మార్పులకు నూతన ప్రారంభాలకు నిటి పర్యాయపదం. దీనికి సీరియల్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్ రాజేష్ జైన్ పురుడు పోశారు. నిటి డిజిటల్ డిజిటల్ మీడియా (NitiCentral.com)లో, ఎన్నికల్లో (IndiaVotes.com) పని చేయడానికి ఈ సంస్థకు తగిన టీమ్స్ ఉన్నాయి. కమ్యూనిటీ ఆర్గనైజింగ్‌కు సంయుక్త భాగస్వామ్యంతో కూడిన వేదికలున్నాయి.
భవిష్యత్తు భారత ఎన్నికల్లో నిర్ణయాల రూపకల్పనకు డిజిటల్ మీడియా, భారీ సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీల సమ్మేళనం సహాయ పడుతుందని నిటీ డిజిటల్ ఎండి రాజేష్ జైన్ చెప్పారు. ఈ స్రవంతుల ఇంటర్ సెక్షన్ తమ సంస్థ వాంఛిస్తోందని అన్నారు. భారత ఎన్నికల సమాచారం అందరికీ అందుబాటులోకి తేవడం ద్వారా ఆ దిశలో ఇండియా వోట్స్ ప్రధానమైన అడుగు అని చెప్పారు.
ఇండియావోట్స్ వద్ద ఇప్పటికే 200 జాతీయ ఎన్నికల సమాచారంతో పాటు రాష్ట్రాల ఎన్నికల సమాచారం సెట్లు ఉన్నాయి. వినియోగదారుల ఇన్‌పుట్స్ ద్వారా దాన్ని మరింత సంపద్వంతం చేయడానికి వీలవుతుంది. తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని యూజర్స్ చేర్చడానికి వీలుగా కూడా ఉంటుంది.












Click it and Unblock the Notifications