బెంగళూర్‌లో అల్లుడిని చంపిన చిత్తూరు వాసి

అల్లుడుని చంపిన తర్వాత మామ మోహన్ రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. చిత్తూరులోని తన ఇంటి నుంచి వారం రోజుల క్రితం తాను బెంగళూర్‌కు వచ్చానని, బాబురెడ్డి తరుచూ తనను కొడుతున్నాడని తన కూతురు తనకు చెబుతూ వస్తోందని ఆయన పోలీసులకు చెప్పాడు. తన అల్లుడు క్రూరుడని, తన కూతురుని తీవ్రంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు.
మంగళవారం రాత్రి బాబు రెడ్డి కల్పనను విపరీతంగా కొడుతున్నారని, తాను జోక్యం చేసుకుని అతనికి సర్దిచెప్పానని అన్నాడు. బుధవారం ఉదయం ఆరు గంటలకు మళ్లీ తన కూతురు కల్పనను కొట్టడం ప్రారభించాడని, తాను ఆపడానికి ప్రయత్నించానని, దాంతో తనపై బాబురెడ్డి చేయి చేసుకున్నాడని వివరించాడు.
దాంతో తనకు విపరీతంగా కోపం వచ్చి కర్ర మొద్దతో బాబురెడ్డి తలపై మోదానని, దాంతో అతను చనిపోయాడని మోహన్ రెడ్డి చెప్పాడు.












Click it and Unblock the Notifications