ఎంతకాలమని కాదు: అది మహేష్ డైలాగ్ ఇది బొత్సది

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లు పైన బొత్స మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లు దేశానికే ఆదర్శం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు. దళితుల సంక్షేమమే కాంగ్రెసు ప్రభుత్వం లక్ష్యమన్నారు. రాష్ట్రాన్ని పాలించిన ఏ పార్టీ కూడా బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై దృష్టి సారించలేదన్నారు. కాంగ్రెసు పార్టీ ఒక్కటే వారి సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే ఇది ప్రవేశ పెట్టామన్నారు. మాట ఇస్తే కాంగ్రెసు నిలబెట్టుకుంటుందని మరోసారి రుజువు అయిందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని, దళితులను ఆదుకోవడమే ఈ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. బిల్లు ప్రవేశ పెట్టిన కాంగ్రెసు సర్కారుకు బొత్స ఆల్ ది బెస్ట్ చెప్పారు. పేదల గోడు విపక్షాలకు పట్టదని ధనవంతుల పైనే వారికి ప్రేమ అన్నారు.
సబ్ ప్లాన్‌కు రాజ్యంగ బద్దమైన అడ్డంకులు ఎదురు కావన్నారు. దీపం పథకాన్ని మరింత పకడ్బంధీగా అమలు చేస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సబ్ ప్లాన్ బిల్లు అమలు చేస్తామన్నారు. ప్రతిపక్షాలది అవకాశవాద రాజకీయమన్నారు. అధికారం కోసం కాంగ్రెసు పూటకో మాట మాట్లాడదన్నారు. అంబేడ్కర్ ఆశయ సంస్కృతికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే సంస్కృతి కాంగ్రెసు పార్టీది అన్నారు.
బిల్లు తీసుకు వస్తున్న ప్రభుత్వానికి సహృదయంతో విపక్షాలు సహకరించి, ఆశీర్వదించాలని, అమలుకు ముందుకు రావాలని కోరారు. అణగారిన వర్గాలు ఇంకా ఎంతకాలం అలాగే ఉండాలని ప్రశ్నించారు. సబ్ ప్లాన్ బిల్లుపై విమర్శలు చేస్తున్న వారికి దళితుల సంక్షేమం పట్టదన్నారు. బిల్లుతో అసమానలు తొలగిపోతాయన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల అధికారం కోసమే పాదయాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టిడిపి, జగన్ పార్టీలకు అధికారమే ధ్యేయమన్నారు. కాంగ్రెసు పార్టీ మినహా ఏ పార్టీ హయాంలోని ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగదన్నారు.












Click it and Unblock the Notifications