ఎన్టీఆర్ నుండి జూనియర్: ఆది నుండి ఆధిపత్య పోరు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో ఆది నుండి ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది! తన సినీ గ్లామర్ పెట్టుబడిగా పార్టీని స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు కూడా అసమ్మతి బెడద తప్పలేదు. అసమ్మతి బెడద మాత్రమే కాదు. ఏకంగా ఆయన కూర్చున్న సిఎం పీఠం పైనే కన్నేసిన నాదెండ్ల భాస్కర రావు.. ఎన్టీఆర్‌కు చుక్కలు చూపించి గద్దెనెక్కారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల అనంతరం ఎన్టీఆర్ మళ్లీ సిఎం అయి 1984లో ప్రజల్లో తేల్చుకుంటానని ఎన్నికలు వెళ్లారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు నాదెండ్ల విజయ భాస్కర్ నుండి అసమ్మతి ఎదుర్కొని పదవికి కొంతకాలం దూరమయ్యారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళతామని చెప్పి ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు.

తోడళ్లుల్లు దగ్గుపాటి వెంకటేశ్వర రావు, నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణకు మధ్య వారసత్వ పోరు సాగింది.

ఎన్టీఆర్ మృతి తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లింది. పార్టీ తన చేతుల్లోకి రాకపోవడంతో హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించి చంద్రబాబును ఎదుర్కొనే ప్రయత్నాలు చేశారు. కానీ బోర్లాపడిన హరి తిరిగి బావ దగ్గరకు చేరారు.

తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వర రావు కూడా ఎన్టీఆర్ వారసత్వం కోసం పోటీ పడి బాబు వ్యూహానికి ఎదురేగలేకనే టిడిపిని వీడి కాంగ్రెసులో చేరారని అంటారు. దీంతో ఎన్టీఆర్ వారసత్వం కాంగ్రెసు పార్టీకి కూడా పాకింది. దగ్గుపాటి సతీమణి, ఎన్టీఆర్ తనయ పురంధేశ్వరి కేంద్రమంత్రిగా ఉన్నారు. దగ్గుపాటి - నారా కుటుంబాల మధ్య ప్రత్యక్ష విమర్సలు పెద్దగా లేకున్నప్పటికీ రాజకీయ పోరు మాత్రం తీవ్రంగా ఉంది.

లక్ష్మీ పార్వతి కూడా వారసత్వం కోసం పోటీ పడింది. ఆమె టిడిపిని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేసిందనే వాదనలు ఉన్నాయి. ఆమె ఎన్టీఆర్ టిడిపిని స్థాపించినప్పటికీ అది క్లిక్ కాలేదు. ఇప్పటికీ ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు. ఇటీవల ఆమె ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని ప్రకటించారు.

నందమూరి బాలకృష్ణ కూడా తెలుగుదేశం పార్టీ పగ్గాల కోసం పోటీ పడినట్లుగా కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఈ నందమూరి హీరో మాత్రం ఎప్పుడు బావకు మద్దతు పలుకుతూనే వస్తున్నారు. చంద్రబాబు వ్యూహాత్మకంగా బాలకృష్ణ తనకు పోటీ రాకుండా ఉండేందుకే తన తనయుడు లోకేష్‌ను బాలయ్య కూతురు బ్రాహ్మిణిని ఇచ్చి పెళ్లి చేశారని విమర్శలు వచ్చాయి.

ఇటీవలి వరకు నారా లోకేష్ - జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా వారసత్వ పోరు నడిచింది. వారిద్దరికీ రాజకీయ అనుభవం లేదు. అప్పుడే వారసత్వ పోరు సాగడం గమనార్హం. ఈ పోరులో జూనియర్ కోసం తండ్రి హరికృష్ణ, లోకేష్ కోసం తండ్రి చంద్రబాబు, మామయ్య బాలకృష్ణ మద్దుగా నిలిచినట్లుగా కనిపించింది. అయితే ఎట్టకేలకు ఈ పోరు ఇటీవల ముగిసింది. దీంతో టిడిపి క్యాడర్‌లోనూ ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి.
ఒకవిధంగా చెప్పలంటే ఎన్టీఆర్, నాదెండ్ల మధ్య కూడా అధికారం కోసం(వారసత్వ అనవచ్చునేమో) తీవ్ర పోరు సాగింది. 1984లో టిడిపి మళ్లీ ఘన విజయం సాధించింది. నాటి నుండి నేటి వరకు టిడిపిలో అంటే నారా - నందమూరి - దగ్గుపాటి కుటుంబాల మధ్య వారసత్వ పోరు కొనసాగుతోనే ఉందని చెప్పవచ్చు. లక్ష్మీ పార్వతి కూడా టిడిపి పగ్గాలు చిక్కక పోవడంతో ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు.
అప్పుడు తోడళ్లుల్లు దగ్గుపాటి వెంకటేశ్వర రావు, నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ మధ్య వారసత్వ పోరు సాగింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ మధ్య వారసత్వ పోరు ఇటీవలి వరకు నడిచింది. అయితే సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన అప్పుడే వారసత్వ పోరుకు తెర పడిందని చెప్పడానికి లేదని అంటున్నారు. ఏ క్షణంలోనైనా బయటకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications