హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సహకరించకున్నా ససేమీరా: పాదయాత్రలో బాబు స్పీడ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రలో రోజు రోజుకు స్పీడ్ పెంచుతున్నారట. ఆరోగ్యం సహకరించకున్నా ఆయన ప్రజల్లో వస్తున్న స్పందనను చూసి జోరు తగ్గించకూడదని అనుకుంటున్నారట. అక్టోబర్ 2న ప్రారంభించిన బాబు పాదయాత్ర మధ్యలో మూడు రోజులు మినహా కొనసాగుతోంది.

63 ఏళ్ల వయస్సులో పాదయాత్ర చేస్తుండటంతో ఆయనకు వయస్సు కాస్త ఇబ్బంది పెడుతోందని దీంతో జనవరి 26 వరకు తలపెట్టిన పాదయాత్ర మధ్యలోనే ఆగిపోతుందా అనే చర్చ ప్రారంభమైంది. మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. పార్టీ నేతలు కూడా బాబు ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకోమని సూచనలు చేస్తున్నారట. కానీ బాబు మాత్రం ససేమీరా అంటున్నారట.

ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాతర ఇచ్చాపురం చేరుకునే వరకు ఆపే ప్రసక్తి లేదని తనకు విశ్రాంతి తీసుకోమని సూచిస్తున్న నేతలకు చెబుతున్నారట. అంతగా అవసరమైతే పాదయాత్రను జనవరి 26 తర్వాత కూడా కొనసాగించేందుకు బాబు ఉత్సాహంగా ఉన్నారట. ఓ వైపు పాదయాత్ర పేరుతో బాబు ఉత్సాహం చూపిస్తుంటే నేతల్లో ఆనందం వ్యక్తమవుతున్నా... విశ్రాంతి తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో నేతలకు, కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగిస్తోందట.

వరుసగా పాదయాత్ర చేస్తుండటంతో బాబుకు షుగర్ లెవల్స్ పడిపోతున్నాయట. కాళ్ల నొప్పులు కూడా తీవ్రంగానే ఉన్నాయి. ఇంకోవైపు చిటికెన వేలుకు దెబ్బ తగులడంతో నడుస్తుంటే దానిపై ఒత్తిడి పడుతోంది. అది కూడా ఇబ్బంది పెడుతోందట. అయినప్పటికీ బాబు మాత్రం పాదయాత్రను ఆపేది లేదని, నడుస్తే ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయని, వాటిని తట్టుకోవాలని, తాను ముందే వీటన్నింటికి ప్రిపేర్ అయి పాదయాత్ర తలపెట్టానని చెబుతున్నారట.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu is not ready to compromise on his Vastunna Meekosam padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X