పార్టీ ఆయన సొంతమా: కిరణ్ రెడ్డిపై వివేక్ ఫైర్

కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, తామంతా తమ అధినేత్రి సోనియాగాంధీ చెప్పినట్లు నడుచుకుంటామే తప్ప ముఖ్యమంత్రి చెప్పినట్లు కాదని ఆయన మండిపడ్డారు. చివరికి సోనియాగాంధీ కూడా ఎన్నడూ ఇలా మాట్లాడలేదని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ చౌక్ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 52 స్థానాల్లో పోటీ చేయగా, 50 చోట్ల ఓడిపోయిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులను, సబ్ గ్రూపులను కిరణ్ ప్రోత్సహిస్తున్నారని, ఇప్పుడున్నన్ని సబ్ గ్రూపులు ఏనాడూ లేవని విమర్శించారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఏనాడూ జిల్లా స్థాయి పార్టీ సమావేశాలు నిర్వహించలేదని, నాయకులంతా ఐక్యంగా ఉన్నారన్న భావన కార్యకర్తల్లో ఏర్పర్చలేదని విమర్శించారు. కాగా, తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications