జైలు నుంచే గాలి ఎన్నికల్లో పోటీ: బళ్లారి లేదా చిత్రదుర్గ

శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తారు. గాలి జనార్దన్ రెడ్డి అనుంగు అనుచరుడు ఈ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది పార్టీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సోమశేఖర రెడ్డి అన్నారు. అయితే, ఆయన బళ్లారి నుంచి గానీ చిత్రదుర్గ నుంచి గానీ పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడున్నా గెలుస్తారని, అభివృద్ధి కోసం ప్రజలు గాలి జనార్దన్ రెడ్డికి ఓటేస్తారని సోమశేఖర రెడ్డి అన్నారు. శ్రీరాములు బిజెపికి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి సూచనతో ఆయన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీని స్థాపించారు.
కాగా, గాలి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని ఒబుళాపురం అక్రమ మైనింగ్ కేసులోనే కాకుండా కర్ణాటకలోని ఎఎంసి అక్రమ మైనింగ్ కేసులో కూడా అరెస్టయ్యారు. గాలి జనార్దన్ రెడ్డిపై బెయిల్ కుంభకోణం కేసు కూడా ఉంది.












Click it and Unblock the Notifications