Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నగరంలో జగన్ పార్టీ పోటీ: బరిలో రియల్‌స్టార్ శ్రీహరి?

YS Jagan-Srihari
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాదు నగరంలోని ఓ స్థానం నుండి పోటీ చేసేందుకు ఉవ్వీళ్లురుతోంది. నిన్నటి వరకు కాంగ్రెసు పార్టీకి అండగా నిలిచిన మజ్లిస్ తాజాగా జగన్ వైపుకు నిలబడేందుకు సిద్ధపడింది. దాదాపు పాతబస్తీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేసే అవకాశం ఏమాత్రం లేదనే చెప్పవచ్చు.

హైదరాబాదులోని మిగిలిన స్థానాల్లో ఓ స్థానం నుండి ప్రముఖ హీరోను రంగంలోకి దింపేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ హీరో ఎవరనే ప్రశ్న పలువురిని తొలుస్తోంది. ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి, వివి వినాయక్‌లతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబ సభ్యుల్లో ఒకరికి టిక్కెట్ ఇచ్చి సీమాంధ్ర ప్రాంతంలో పోటీ చేయించేందుకు వైయస్సార్ కాంగ్రెసు సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా హైదరాబాదులో కూడా ఓ ప్రముఖ హీరోను ఏదో ఒక స్థానం నుండి బరిలోకి దింపి నగరాన్ని మొత్తం ప్రభావితం చేయాలనే ఉద్దేశ్యంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లుగా చెబు తున్నారు. హీరో పోటీ చేస్తారని ప్రకటించడంతో ఆ హీరో ఎవరనే ప్రశ్న రాజకీయ వర్గాలతో పాటు అందరినీ తొలుస్తోంది. పలువురు ఆ హీరో మాస్ హీరో రియల్ స్టార్ శ్రీహరి కావొచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అందుకు వారు కారణాలు కూడా చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం హీరో శ్రీహరి అనూహ్యంగా బయటకు వచ్చి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాను అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని చెప్పారు. శ్రీహరికి సహాయ గుణం ఉంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సహాయం చేయాలని శ్రీహరి భావిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పుడు స్వాగతించారు.

శ్రీహరి వంటి సహాయ గుణం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. శ్రీహరి కూడా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు ఓ ప్రముఖ హీరోను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. శ్రీహరికి బాలానగర్ ప్రాంతంలో మంచి పేరు ఉంది. దీంతో ఆ చుట్టుపక్కల గల ఓ నియోజకవర్గం నుండి శ్రీహరి జగన్ పార్టీ తరఫున పోటీ చేస్తారా అనే ప్రశ్న పలువురిలో తలెత్తుతోంది. సనత్ నగర్ నుండి పోటీ చేయవచ్చునని అంటున్నారు.

శ్రీహరి మినహా ఇతర హీరోలు రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పలేదు. రియల్ స్టార్ శ్రీహరియే నగరంలో జగన్ పార్టీ అభ్యర్థి కావొచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. జగన్ పార్టీ స్థాపించాక దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో విభేదించిన నేతలు కూడా ఆ పార్టీలో చేరారు. శ్రీహరి చేరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే హీరో శ్రీహరి వంటి వారు జగన్ పార్టీ వైపుకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవచ్చుననే మరో వాదన కూడా వినిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+