రేపు జగన్ పార్టీలోకి టిడిపి ఎమ్మెల్యే: విజయమ్మ సభ

కాగా చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిలు కొంతకాలంగా పార్టీ అధినేతపై విమర్శలు చేసి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. ఇటీవలే వారు తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
బాబుపై గట్టు ఫైర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్ర రావు హైదరాబాదులో మంగళవారం మండిపడ్డారు. బాబు మానసిక పరిస్థితి సరిగా లేదన్న అనుమానం తనకు కలుగుతోందన్నారు. ఆయనకు తక్షణమే వైద్య చికిత్సలు అందించాలని తెలుగుదేశం పార్టీకి సూచించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తులో కాంగ్రెసులో కలుస్తుందని చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో ప్రజల మద్దతు తగ్గుతున్న కొద్ది చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. తనకు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆదర్శమని చెబుతున్న బాబుకు ఆయన పేరును ఉచ్చరించే నైతిక అర్హత లేదన్నారు.












Click it and Unblock the Notifications