కెసిఆర్‌కు జగ్గారెడ్డి సవాల్: ఎన్డీఏ మద్దతిస్తానన్న నాగం

Jagga Reddy-Nagam Janardhan Reddy
మెదక్/వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దమ్ముంటే తన సొంత జిల్లా నుండి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయాలని మెదక్ జిల్లా సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) మంగళవారం సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారో కెసిఆర్ చెప్పాలని, సొంత జిల్లాలో పోటీ చేసే దమ్ముందా అన్నారు.

కెసిఆర్, ఆయన కుటుంబం ఉద్యమం పేరుతో దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. కెసిఆర్‌ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఉద్యమం చేస్తున్నారని, ఆయన దృష్టి అంతా ఓట్లు, సీట్లు పైనే అన్నారు. తనకు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కెసిఆర్ చెప్పాలని, ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం 1969లో జైలుకెళ్లిన 106 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మజ్లిస్ పార్టీ మతం పేరుతో రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.

తెలంగాణ కోసం ఎన్డీయేకు మద్దతు

తాను తెలంగాణ కోసం ఎన్డీయేకు మద్దతిస్తానని మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి వరంగల్ జిల్లాలో చెప్పారు. తాను ఏ పార్టీలో చేరనని, తెలంగాణ కోసం పని చేస్తానన్నారు. తెలంగాణ పేరుతో కొందరు మంత్రి పదవులు పొందుతున్నారని ఆరోపించారు. ఇక నుండి మంత్రుల నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని నాగం చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నో సమస్యలపై మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణ కోసం జరుగుతున్న ఆత్మహత్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం జరిగిన ఆత్మబలిదానాలపై మాట్లాడాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+