ద్రౌపది కథ రిపీట్: జూదంలో భార్యను ఓడిన వ్యక్తి

తన భర్త వ్యవహారంతో జూదంలో తనను గెలుచుకున్నవాళ్లు తనను తీసుకుపోవడానికి రావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు - పది రోజుల క్రితం ఆమెను భర్త జూదంలో ఓడాడు. తనను గెలుచుకున్న జూదగాళ్లు తనను తీసుకుని పోవడానికి వచ్చారు. దాంతో ఆమె వారిని తప్పించుకుని పారిపోయింది.
ఎలాగో దగ్గరలోని జార్చా పోలీసు స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. తన మరిదితో లెైంగిక సంబంధం పెట్టుకోవాలని తన భర్త గతంలో తనపై ఒత్తిడి చేశాడని కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దానికి ఆమె నిరాకరించింది. దాంతో భర్త ఆమెను విపరీతంగా కొట్టాడు.












Click it and Unblock the Notifications