దమ్ముచూపిస్తాం, జగన్‌వి ఉరేసే నేరాలు: నానికి దేవినేని

బాలకృష్ణ పైన, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన నాని.. వారి పార్టీ హత్యా సంస్కృతిని, అవినీతి కోణాన్ని మరోసారి బయటపెట్టారని విమర్శించారు. టిడిపి నేతలను ఆయన 420 అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన చేరిన పార్టీ అధ్యక్షుడు జగన్ ఓ 302 అని, ఆయన ఇప్పటికే జైలులో ఊచలు లెక్కిస్తున్నారన్నారు. జగన్ పైన మోపిన సెక్షన్లు మామూలువి కావన్నారు.
ఉరిశిక్ష వేయదగ్గ నేరాలు అన్నారు. హత్య కన్నా ఆర్థిక నేరాలు అత్యంత తీవ్రమైనవని సుప్రీం కోర్టే చెప్పిందన్నారు. వారి నేర ప్రవృత్తి బయట పడిందన్నారు. జగన్ అవినీతిని ఆ పార్టీ నేతలు పంచుకుంటారన్నారు. బాబును, రావి కుటుంబాన్ని విమర్శించే నైతిక అర్హత నానికి లేదన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ను దేవుడు అన్న మీరు పార్టీ ఎలా మారారని ప్రశ్నించారు. బాలయ్యను విమర్శించేందుకు నోరు ఎలా వచ్చిందన్నారు.
నాని నిరాశలో ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. జగన్ ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదని, ఆ పార్టీ కాంగ్రెసులో కలిసిపోతుందని, చర్చలు సాగుతున్నట్లు మాజీ మంత్రి, ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డే చెప్పారని, జగన్ బయటకు వచ్చేందుకు నాలుగైదేళ్లు పడుతుందని అందుకే నాని నిస్పృహలో ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఎన్టీఆర్‌ను దేవుడు అని చెప్పి ఆయన ఫోటోను దయ్యాల పక్కన పెడతావా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications