'గాలి హెలికాప్టర్ ధరను అంచనా వేయలేం': కారు రిలీజ్

దీంతో హెలికాప్టర్ ధరను నిర్ణయిస్తే ఆ మేరకు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకొని హెలికాప్టర్‌ను అప్పగిస్తామని కోర్టు తెలిపింది. అలాగే దాని ధరను అంచనా వేసేందుకు బెల్ సంస్థ ప్రతినిధికి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. హెలికాప్టర్ ధరను నిర్ణయించాలని బెల్ అధికారులను కోరారు. దానికి బెల్ అధికారులు తాము అంచనా వేయలేమని చెప్పారు. మరోవైపు హెలికాప్టర్‌తో పాటు గాలి కారును సిబిఐ అప్పుడు స్వాధీనం చేసుకుంది. దానిని వారికి అప్పగిస్తూ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్‌ను ఈ రోజు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్డు ఎదుట హాజరుపర్చనున్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించే ప్రత్యేక న్యాయవాది మూడు రోజుల పాటు సెలవులో ఉన్నారు. మరోవైపు రేపటితో జగన్ ఆస్తుల కేసులో వైయస్ జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకట రమణ, బ్రహ్మానంద రెడ్డి, ఓఎంసి కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, రాజగోపాల్, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డిల రిమాండ్ ముగియనుంది.
వారిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించాల్సి ఉంది. ప్రత్యేక న్యాయవాది సెలవులో ఉన్నందున వీడియో కాన్ఫరెన్సుకు అవకాశం లేదు. దీంతో జగన్‌తో సహా మిగిలిన వారిని అందర్నీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే చంచల్‌గూడ అధికారులకు ఈ సమాచారాన్ని అందించారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications