జగన్ కోసమేనా డీకే శివకుమార్ కు సీఎం ? రాహుల్ బిగ్ స్కెచ్..!

ఈ మధ్య ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దక్షిణాదిలో బలపడుతున్న కాంగ్రెస్ పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ ప్రాంతాన్ని కంచుకోటగా మార్చుకునేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పావులు కదుపుతున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో కర్నాటక, తెలంగాణ, కేరళలో సొంత ప్రభుత్వాలను నడుపుతున్న కాంగ్రెస్ .. తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో కేరళ, తమిళనాడులో సానుకూలంగా మారిన పరిస్దితుల అండతో దక్షిణాదిలో కొత్త ఊపు తెచ్చుకోవడంతో పాటు మిగిలిన ఏకైక రాష్ట్రం ఏపీని సైతం తమవైపు తిప్పుకునేందుకు రాహుల్ పావులు కదిపారు.

ఇందులో భాగమే కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న సిద్దరామయ్య స్ధానంలో డీకే శివకుమార్ (Dk Shivakumar) కు అవకాశం కల్పించడం. వాస్తవానికి ఇప్పటికిప్పుడు సిద్దరామయ్యను మార్చి డీకే శివకుమార్ ను సీఎం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదు. కానీ దక్షిణాదిలో తాజాగా వచ్చిన ఊపును కొనసాగించేందుకు కర్నాటకలో సీఎంను మార్చాలని రాహుల్ భావించినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఇక్కడ వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన డీకే శివకుమార్ ను సీఎం చేయడం ద్వారా ఏపీలో సైతం పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. తద్వారా వైఎస్ కుమారుడైన జగన్ (jagan)ను తమవైపు తిప్పుకోవచ్చని భావిస్తోంది.

The Jagan Factor Why Rahul Gandhi May Have Handpicked DK Shivakumar for a Bigger Game
మీ సీబీఐ దర్యాప్తా ? నా విచారణ కమిషనా ? జగన్ అల్టిమేటం..!
మీ సీబీఐ దర్యాప్తా ? నా విచారణ కమిషనా ? జగన్ అల్టిమేటం..!

2029 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావాలంటే దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు అత్యంత కీలకం. కానీ దక్షిణాదిలో కాంగ్రెస్‌కు దక్కకుండా మిగిలిపోయిన ఏకైక పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా జగన్ ఎప్పుడో లాగేసుకున్నారు. ప్రస్తుతం జగన్ బీజేపీ కోసం కాంగ్రెస్ ను సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శిస్తున్నారు. అయితే ఏపీలో ప్రస్తుతం ఉన్న కూటమి సర్కార్ ఇంకా బలపడితే జగన్ కచ్చితంగా రాజకీయ ఒత్తిడికి లోనవుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అప్పుడు కచ్చితంగా పరోక్షంగా అయినా సరే కాంగ్రెస్ సాయం కోరవచ్చనే అంచనాలున్నాయి.

The Jagan Factor Why Rahul Gandhi May Have Handpicked DK Shivakumar for a Bigger Game
దక్షిణాదిపై రాహుల్ భారీ వ్యూహం..! ఆ మూడు నిర్ణయాల వెనుక ?
దక్షిణాదిపై రాహుల్ భారీ వ్యూహం..! ఆ మూడు నిర్ణయాల వెనుక ?

ఈ తరుణంలో జగన్‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చడం లేదా మిత్రపక్షంగా మార్చుకోవడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ తిరిగి జవసత్వాలు పుంచుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే జగన్ బెంగళూరు రహస్యాలన్నీ డీకే శివకుమార్ కు ఎలాగో తెలుసు. అలాగే ఆయన సోదరి వైఎస్ షర్మిల తో కూడా డీకే శివకుమార్ కు సత్సంబంధాలు ఉన్నాయి.వైఎస్ కాలం నుంచే ఆ కుటుంబంతో డీకేకు వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీకే చొరవ తీసుకుని జగన్ ను కాంగ్రెస్ కు దగ్గర చేస్తారనే అంచనాతోనే ఆయనకు సీఎం పగ్గాలు అప్పగించి ఉండొచ్చని తెలుస్తోంది. అవసరమైతే షర్మిలను వెనక్కి తగ్గేలా చేసి జగన్ కు ప్రాధాన్యమిచ్చి ఆయన్ను ఇండియా కూటమివైపు తిప్పేందుకు ట్రబుల్ షూటర్ అయిన డీకే కు మంచి ఛాన్స్ ఉంది. ఇందులో డీకే విజయం సాధిస్తే మాత్రం దక్షిణాదిలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా ఆయన మారడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+