రోజూ ఓ స్పూన్‌ నువ్వులు తింటే.. ఎన్నో సమస్యలకు దివ్యౌషధం..!!

నువ్వులు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వులలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. నువ్వులను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో.. చెడు కొలెస్టరాల్‌ను కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపకరిస్తాయి. నువ్వులను తీసుకోవడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు నువ్వులు చాలా మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

నువ్వులు ఆరోగ్య పోషకాలు అందిస్తాయి. రోజూ కాసిని నువ్వులని ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్‌తోపాటు, ట్రైగ్లిజరాయిడ్లు అదుపులో ఉంటాయి. ఫలితంగా గుండెజబ్బుల నుంచి రక్షణ దొరుకుతుంది. నువ్వుల్లో మేలు చేసే కొవ్వులు ఉండటమే ఇందుకు కారణం అంటున్నాయి అధ్యయనాలు. మామూలు నువ్వులతో పోలిస్తే వేయించినవి తింటే మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయట. ముఖ్యంగా కండరాల బలానికీ, హార్మోన్లు చురుగ్గా ఉండటానికీ ఇవి ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలంలో నువ్వులను మన ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతిరోజూ నువ్వుల లడ్డులు లేదా సాధారణ నువ్వుల చట్నీ కూడా తినవచ్చు. నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పెద్ద మొత్తంలో కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి కూడా మేలు చేస్తాయి. శీతాకాలంలో నువ్వుల పొడిని తయారు చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

చంద్రబాబు, విజయ్ ను అధిగమించిన డీకే శివకుమార్ - దేశంలోనే నెంబర్ ఒన్..!!
చంద్రబాబు, విజయ్ ను అధిగమించిన డీకే శివకుమార్ - దేశంలోనే నెంబర్ ఒన్..!!
sesame-seeds-may-help-lower-cholesterol-and-triglycerides-support-blood-sugar-management-reduce-in

నిపుణుల సూచనలు

నువ్వులు తింటే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీటిలోని 'ఒలియిక్ యాసిడ్', 'లినోలిక్ యాసిడ్' వంటివి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడ తాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నువ్వులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపర చడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నువ్వులలో ఉండే అధిక కాల్షియం ఎముకల బలోపేతానికి తోడ్పడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులతో పోరాడేందుకు నువ్వులను తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నువ్వులు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కూడా చాలా మేలు చేస్తాయి. నువ్వులలోని అధిక పీచు అరుగుదలకు తోడ్పడుతుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి నువ్వులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. నువ్వులు మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నువ్వులలో ఉండే అనేక పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా నువ్వుల్లో ఉండే విటమిన్ బి6 మెదడుకు మేలు చేస్తుంది. దీంతో.. నువ్వులు రెగ్యులర్ గా ఆహారంలో ఉండే విధంగా తీసుకుంటే ఆరోగ్య పరమైన ప్రయోజనాలు అందుతాయని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+