India-Sri Lanka ODI : ఢిల్లీ నిరసనల ఎఫెక్ట్. భారత్-శ్రీలంక వన్డే వేదిక మార్పుపై బీసీసీఐ క్లారిటీ ..!
దేశ రాజధాని ఢిల్లీ మహానగరం ఇప్పుడు నిరసనలతో అట్టుడుకుతోంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఓవైపు విపక్షాలు, మరోవైపు విద్యార్ధి సంఘాలు, ఇంకోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపడుతున్నాయి. దీంతో ఢిల్లీలో పోలీసులు కూడా భారీ ఎత్తున ఆంక్షలు అమలు చేస్తూ వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే భారత్-శ్రీలంక సిరీస్ పైనా ఈ ప్రభావం పడేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో భారత్-శ్రీలంక మధ్య జరిగే తొలి వన్డే (India-Sri Lanka ODI ) వేదిక మారుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ (BCCI) ఇవాళ స్పందించింది.
శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లోని తొలి వన్డేను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు మార్చారన్న వార్తలను బీసీసీఐ ఖండించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 13న జరగాల్సిన ఈ మ్యాచ్‌ను షెడ్యూల్ ప్రకారమే ఢిల్లీకి కేటాయించారని, వేదిక విషయంలో ఎలాంటి మార్పు చేయలేదని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో జరగాల్సిన భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు మార్చవచ్చని వస్తున్న వార్తలు ఖచ్చితమైనవి కావని ఆయన తేల్చేశారు. బీసీసీఐ అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని సైకియా తెలిపారు. అంతేకాకుండా, ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లను ప్రాథమికంగా ఒక ప్రామాణిక విధానాన్ని అనుసరించి కేటాయిస్తారని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా, డిసెంబర్ 19న సిరీస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్‌కు ఈ మ్యాచ్‌ను తరలిస్తున్నారని వార్తలొచ్చాయి. భారత జట్టుకు ఇప్పటికే బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ వాటిపై క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 13న వన్డేలతో మొదలయ్యే భారత్-శ్రీలంక సిరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ లు జరుగుతాయి. అనంతరం మూడు టీ20లు కూడా ఉంటాయి. వన్డేలకు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, టీ20లకు రాజ్ కోట్, కటక్, పూణే ఆతిధ్యమివ్వబోతున్నాయి. మరోవైపు భారత్ ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. వన్డే సిరీస్ ఇప్పటికే పూర్తయింది. ఆ తర్వాత, అక్టోబర్ 22న ప్రారంభమయ్యే సిరీస్ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో క్రైస్ట్‌చర్చ్, వెల్లింగ్టన్, ఆక్లాండ్, హామిల్టన్ , మౌంట్ మాంగనూయిలలో ఐదు టీ20ఐలు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు జరుగుతాయి.














Click it and Unblock the Notifications
