ఎన్నికల ఓటర్ల జాబితాల సవరణ(SIR) ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాక్రోచ్ జనాతా పార్టీ(సీజేపీ) అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. మండి హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకు భారీ పాదయాత్ర చేపట్టి తమ నిరసనను తెలియజేయాలని సీజేపీ నాయకులు నిశ్చయించుకున్నారు. దీంతో జాతీయ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ ఉష్ణోగ్రతలు పతాక స్థాయికి చేరి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.IND vs WI: రూథర్‌ఫోర్డ్, హోప్ ఊచకోత.. భారత్‌పై వెస్టిండీస్ ఘనవిజయం!మండి హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకు పోలీసుల దిగ్బంధం ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు ఢిల్లీ పోలీసులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. మండి హౌస్ రౌండ్ అబౌట్ నుంచి జంతర్ మంతర్ వరకు ప్రధాన రహదారులతో పాటు పరిసర వీధుల్లోనూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఫిరోజ్ షా రోడ్, బారాఖంబా రోడ్, కన్నాట్ ప్లేస్ మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల, ప్రజల రాకపోకలను పరిమితం చేశారు. ఢిల్లీలోని ప్రతి సందులోనూ పోలీసులు గస్తీ కాస్తూ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.@@ దీప్కే అరెస్టు కోసం మహిళా పోలీసులు ఎందుకొచ్చారు... దీని వెనుకున్న వ్యూహం ఏంటి?పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా వ్యంగ్యాస్త్రాలు ఢిల్లీ పోలీసులు చేపట్టిన ఈ భారీ భద్రతా మోహరింపుపై పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఢిల్లీ పోలీసుల తీవ్ర అప్రమత్తతను చూసి చమత్కరిస్తూ.. ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోవాలని నేను ఆశిస్తున్నాను! అంటూ ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. పోలీసుల వ్యూహాత్మక మోహరింపును క్రికెట్ భాషత్ పోలుస్తూ డానిష్ కనేరియా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.