SIR అక్రమాలు, జ్ఞానేష్ పాత్రపై సుప్రీంకు రాహుల్..! 10 కీలక డిమాండ్లు.!

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ( ఎస్ఐఆర్) ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఇండియా కూటమి ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియపై తక్షణమే మధ్యంతర స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324తో పాటు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ఈ పిటిషన్ వేసినట్లు తెలిపారు.

సుప్రీంకు భారీ ర్యాలీగా రాహుల్, ప్రియాంక- పోలీసుల బ్రేక్-ఢిల్లీలో టెన్షన్..!
సుప్రీంకు భారీ ర్యాలీగా రాహుల్, ప్రియాంక- పోలీసుల బ్రేక్-ఢిల్లీలో టెన్షన్..!

'రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా' పేరుతో దాఖలైన ఈ సంయుక్త పిటిషన్‌కు విపక్షాల అగ్రనేతలు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ తదితరులు ఈ న్యాయ పోరాటంలో భాగమయ్యారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్ణయాలను రద్దు చేయాలని వారు కోరారు. విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌లో ఎన్నికల సంఘం ఎదుట 10 కీలక డిమాండ్లను ఉంచారు. జూన్ 24, 2025 నుంచి ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అధికారిక ఫైళ్లు, నిమిషాల నివేదికలు, ఈసీనెట్, ఈఆర్‌ఓనెట్ యాక్సెస్ లాగ్‌లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించాలని కోరారు. 2023 నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం ఈ నిర్ణయాల చట్టబద్ధతను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

Rahul Gandhi Seeks 10 Measures in Supreme Court Including SIR Stay and Electoral Roll Audit
ఇండియా కూటమిని అందుకే రావొద్దన్నా..! తేల్చేసిన సీజేఐ సూర్యకాంత్ ..!
ఇండియా కూటమిని అందుకే రావొద్దన్నా..! తేల్చేసిన సీజేఐ సూర్యకాంత్ ..!

ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాయకత్వంలో, సాంకేతిక నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు కోరాయి. ఈ కమిటీ ద్వారా ఓటర్ల జాబితా సవరణలు, తొలగింపులు, ఈవీఎంల సాంకేతిక రూపకల్పనపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కోరాయి. అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 లోని సెక్షన్ 32 కింద నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ముందస్తు నోటీసు ఇవ్వకుండా, సహేతుకమైన విచారణ అవకాశం కల్పించకుండా ఏ ఓటరు పేరునూ తొలగించకూడదని పిటిషన్‌లో స్పష్టం చేశారు. ఇప్పటివరకు తొలగించిన ఓటర్ల జాబితాను బూత్‌ల వారీగా, వయస్సు, లింగ నిష్పత్తి మరియు స్పష్టమైన కారణాలతో బహిరంగంగా ప్రచురించాలని కోరారు. రాబోయే ఎన్నికలు ఉన్న పంజాబ్ తదితర రాష్ట్రాల్లోని అర్హులైన పౌరులకు ఓటరు నమోదుకు తుది గడువు వరకు తగిన అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఈ అంశాలు తేలేవరకు నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున భేటీకి నిరాకరించడంతో, విపక్ష నాయకులు న్యాయపోరాట మార్గాన్ని ఎంచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+