సీఎం విజయ్ తో భేటీ అయిన విజయ్ దేవరకొండ- రష్మిక.. సోషల్ మీడియా షేక్
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ అధినేత విజయ్ ను టాలీవుడ్ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను విజయ్ దేవరకొండ తన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఒక్క మీటింగ్ తోనే ఆయన తనకు మోస్ట్ ఫేవరెట్ అయిపోయారని తెలిపారు. ఈ ఆత్మీయ భేటీలో జీవితం, పని, ప్రపంచం గురించి చర్చించుకున్నట్లు తెలిపారు. విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Had the most beautiful time with the dearest Thalapathy @actorvijay Sir.Even after a long day he received us with so much love and shared such personal insights into life, work and the world. One meeting and sir is already a favourite ❤️ Until next time,My love and respect.Vijay Deverakonda :)
— Vijay Deverakonda (@TheDeverakonda) October 12, 2026
" ప్రియమైన దళపతి విజయ్ సర్ తో మోస్ట్ బ్యూటిపుల్ సమయాన్ని గడిపాము. చాలా రోజులు అయినా మిమ్మల్ని ఆయన ఎంతో ప్రేమతో స్వాగతం పలికారు. వ్యక్తిగత విషయాలతోపాటు ప్రపంచం, పని, జీవితం తదితర అంశాలపై మాట్లాడారు. ఒక్క మీటింగ్ తో ఆయన ఆల్ రెడీ నాకు మోస్ట్ ఫేవరెట్ అయిపోయారు. మరోసారి ఆయన్ను కలిసేంత వరకూ నాకు ఆయనపై ఉన్న ప్రేమ, గౌరవంలో ఏమాత్రం రాజీ ఉండదు.. మీ విజయ్ దేవరకొండ" అని విజయ్ దేవరకొండ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు.

అటు రష్మిక కూడా ఈ భేటీపై తన సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. 'చాలా కాలం తర్వాత విజయ్ సార్ ను కలవడానికి వెళ్లాను. ఆయనకు ఎప్పటినుంచో నేను బిగ్ ఫ్యాన్ ను. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన్ను చూసి ఆరాధిస్తున్నా. ఆయన ప్రయాణం నమ్మశక్యం కానిది. మీకు ఎల్లప్పుడూ నా ప్రేమ, శుభాకాంక్షలు ఉంటాయి సార్" అని రష్మిక పేర్కొంది. ఇక విజయ్ తో రష్మిక వారసుడు అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ భేటీపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ మీట్స్ విజయ్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరొకరు రౌడీ మీట్స్ చీఫ్ మినిస్టర్ అని కామెంట్ పెట్టారు. లైఫ్ టైమ్ మెమోరీ ఫర్ దిస్ స్వీట్ కపుల్ అని మరొకరు కామెంట్ చేశారు. టూ విజయ్ లు ఒకే ఫ్రేమ్ లో అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.












Click it and Unblock the Notifications
