విజయవాడ-తిరుపతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- రేపటి నుంచి ఈ రైళ్లు..!
దసరా పండుగ సందర్భంగా రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సాధారణ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లు కూడా రద్దీగా మారాయి. దీంతో దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విజయవాడ (Vijayawada), తిరుపతి (Tirupati) స్టేషన్ల మధ్య మరికొన్ని ప్రత్యేక రైలు సర్వీసుల్ని (Special Trains) ప్రకటించారు. రేపటి నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్, స్టాప్ లు, ఇతర వివరాలను అధికారులు వెల్లడించారు.
అక్టోబర్ 13 నుంచి 16 వరకు విజయవాడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు విజయవాడ-తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. రైల్వే శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం రెండు ప్రత్యేక రైళ్లను ఈ రెండు స్టేషన్ల మధ్య నడపనున్నారు. వీటిలో రైలు నంబర్ 07249 విజయవాడ-తిరుపతి ఎక్స్‌ప్రెస్, అలాగే రైలు నంబర్ 07250 తిరుపతి-విజయవాడ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఈ రెండు ప్రత్యేక రైళ్లూ రేపటి నుంచి అందుబాటులో ఉంటాయి.

వీటిలో 07249 విజయవాడ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ విజయవాడలో ఉదయం 9:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 7 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే 07250 తిరుపతి-విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైలు తిరుపతిలో రాత్రి 9:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5:30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లకూ రెండు వైపులా పెదవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు,, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టాప్ లు ఇచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లలో 1 ఏసీ టూ టైర్ కోచ్, 2 ఏసీ త్రీ టైర్ కోచ్‌లు, 6 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. పండగ సీజన్లో విజయవాడ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి విజయవాడకు ప్రయాణించాలనుకునే వారు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకోవచ్చని రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.














Click it and Unblock the Notifications
