Catch 22: ఢిల్లీ నిరసనలతో బీజేపీ క్యాచ్ 22లో చిక్కుకుందా ? ఏంటీ ఎఫెక్ట్..?

ఎస్ఐఆర్ అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ లో నెలకొన్న విభేదాల్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టిన తర్వాత కేంద్రంలో ఎన్డీయేని నడుపుతున్న బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది. ముఖ్యంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar ) ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వెనుక బీజేపీ ఉందన్న ప్రచారం ఓవైపు కొనసాగుతుండగా.. ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్ని ఎలా అడ్డుకోవాలో, ఎదుర్కోవాలో తెలియక అధికారపక్షం సతమతం అవుతోంది. ఈ పరిస్దితినే క్యాచ్ 22 గా (Catch-22) గా రాజకీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

Telangana SIR: 74 లక్షల మందికి గుడ్ న్యూస్- ఈసీ కీలక అప్డేట్..!
Telangana SIR: 74 లక్షల మందికి గుడ్ న్యూస్- ఈసీ కీలక అప్డేట్..!

ఏంటీ క్యాచ్ 22 పరిస్దితి (Catch-22 Situation)?

ఒక పని చేయాలంటే ముందుగా మరో పని జరగాలి, కానీ ఆ రెండో పని జరగాలంటే మొదటి పని చేయాల్సి ఉంటుంది, ఇలా ఒకదానిపై మరొకటి ఆధారపడి, సమస్య నుంచి బయటపడలేని పరిస్థితిని క్యాచ్ 22గా రాజకీయ విశ్షేషకులు అభివర్ణిస్తుంటారు. ఉదాహరణకు ఉద్యోగం కోసం ప్రయత్నించే సందర్భంలో.. ఉద్యోగం రావాలంటే అనుభవం ఉండాలి అని కంపెనీ చెబుతుంది. , అనుభవం రావాలంటే ముందుగా ఉద్యోగం రావాలి, ఉద్యోగం లేకపోతే అనుభవం రాదు, అనుభవం లేకపోతే ఉద్యోగం రాదు.ఇదే క్యాచ్ 22 పరిస్థితి. అలాగే మరో ఉదాహరణ చూస్తే ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే ఒక సర్టిఫికెట్ కావాలి, ఆ సర్టిఫికెట్ పొందాలంటే ఉద్యోగంలో ఉన్నట్లు ఆధారం చూపాలి. ఉద్యోగం లేకుండా సర్టిఫికెట్ రాదు, సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగానికి దరఖాస్తు చేయలేరు. అలాగే ఇంటికి వెళ్లడానికి డబ్బులు కావాలి, ఆ డబ్బులు సంపాదించడానికి పనికి వెళ్లాలి, కానీ పనికి వెళ్లడానికి కూడా డబ్బులు కావాలి. ఇదీ క్యాచ్ 22 పరిస్ధితికి మంచి ఉదాహరణ. సులభంగా చెప్పాలంటే: ఏం చేసినా సమస్య నుంచి బయటపడలేని పరిస్థితి.

CEC Gyanesh Kumar Row CEC Gyanesh Kumar Row Is BJP Facing a Catch-22 Situation Over Delhi Protests
ఫామ్ 6 మార్పులపై సుప్రీం బిగ్ ట్విస్ట్..! సీఈసీ జ్ఞానేష్ కు ఊరట..!
ఫామ్ 6 మార్పులపై సుప్రీం బిగ్ ట్విస్ట్..! సీఈసీ జ్ఞానేష్ కు ఊరట..!


బీజేపీ క్యాచ్ 22 ఎదుర్కొంటోందా ?

కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాల నుంచి మొదలైన విమర్శల పరంపర.. ఇప్పుడు సీఈసీ జ్ఞానేష్ కుమార్ తో రాజీనామా చేయించడం లేక ఆయనపై పార్లమెంట్ లో అభిశంసన పెట్టి సాగనంపాలన్న డిమాండ్ల వరకూ వచ్చేసింది. దీంతో ఢిల్లీవీధులు విపక్షాలు, విద్యార్ధులు, కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులతో నిరసనల హోరెత్తుతోంది. ఇదంతా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మెడకు చుట్టుకుంటోంది. అందుకే బీజేపీ ఇప్పుడు క్యాచ్ 22లో చిక్కుకుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎందుకంటే ఆందోళనలు ఆగాలంటే జ్ఞానేష్ తప్పుకోవాలి లేదా తప్పించాలి. అలా చేస్తే కానీ విపక్షాలు, ప్రజా సంఘాలు శాంతించేలా లేవు. అలాగని జ్ఞానేష్ ను తప్పించడం అంత సులువు కాదు. ఎందుకంటే జ్ఞానేష్ ను తప్పిస్తే వరుసగా రెండోసారి ఢిల్లీలో కేంద్రం ఓటమిని అంగీకరించినట్లు అవుతోంది. అలాగని మౌనంగా ఉన్నా విమర్శలు, నిరసనల హోరు తప్పడం లేదు. దీంతో బీజేపీ ఇప్పుడు క్యాచ్ 22 లాంటి పరిస్ధితి ఎదుర్కుంటోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

CEC Gyanesh Kumar Row CEC Gyanesh Kumar Row Is BJP Facing a Catch-22 Situation Over Delhi Protests


బీజేపీ ముందున్న మార్గం

గతంలో నీట్ అక్రమాలపై కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చినప్పుడు వారిని తక్కువగా అంచనా వేసిన కేంద్రం.. ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకుంది. జంతర్ మంతర్ లో సోనమ్ వాంగ్ చుక్ నిరాహారదీక్ష సాయంతో కాక్రోచ్ లు రెచ్చిపోయారు. వాళ్లను కంట్రోల్ చేసే పరిస్ధితి లేక కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించేసింది. ఇప్పుడు అదే తరహాలో జ్ఞానేష్ తోనూ అదే విధంగా రాజీనామా చేయించవచ్చు . కానీ కేంద్రానికి రాజకీయంగా భారీ ఎదురుదెబ్బ తప్పదు. ఈ ప్రభావం కూడా ఇక్కడితో ఆగదు. వచ్చే ఏడాది చివరి లోపు జరగాల్సిన దాదాపు 10 రాష్ట్రాల ఎన్నికలపై పడుతుంది. అంతటితో కూడా ఇది ఆగదు. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలపైనా పడే ఛాన్స్ ఉంది. దీంతో బీజేపీ కర్ర విరగకుండా, పాము చావకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఓ దశ దాటిన తర్వాత ఏ ఉద్యమం అయినా రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు నష్ఠం కలిగించడం ఖాయం. అయితే ఇందులో తక్కువ నష్టంతో బయటపడాలంటే మాత్రం జ్ఞానేష్ తో రాజీనామా చేయించడమే మార్గమని విశ్లేషకులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+