కేబినెట్ నిర్ణయాలు:ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు, కృష్ణా నది తీరాన 'అమరావతి ఐ'..!!
ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు ఆమోద ముద్ర వేసింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుకు ఆమోదం తెలిపింది. అమరావతి కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లండన్‌లోని ప్రసిద్ధ 'లండన్ ఐ' తరహాలో దీనిని కృష్ణా నది తీరాన నిర్మించడానికి అమోదించారు. అదే విధంగా భూముల కేటాయింపులు... రెండేళ్ల పాలన పైన చర్చ సమయంలో ముఖ్యమంత్రి మంత్రులకు కీలక దిశా నిర్దేశం చేసారు.
ఏపీ మంత్రివర్గం పలు నిర్ణయాలను ఆమోదించింది. ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచింది. CPS అమల్లోకి రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఎంపికై వివిధ కారణాలతో ఆ పరిధిలోకి వచ్చిన ఉద్యోగులకు పాత పింఛను అమలు ప్రతిపాదనలకు కేబినెట్ సమ్మతి తెలిపింది. అలాగే నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీలో సవరణలను ఆమోదించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్ (VB-GRAMG)ను జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదించింది. ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు
అదే విధంగా అగ్రిగోల్డ్ తదితర డిపాజిటర్ల కేసుల పరిష్కారం కోసం 21 పోస్టుల మంజూరుకు ఆమాత్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. PM-KUSUM పథకం కింద చిత్తూరు జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు NREDCAPకు 30 ఏళ్ల లీజు ఇచ్చేందుకు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు HUDCO నుంచి రూ.300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోద ముద్ర వేసారు. లండన్‌లోని ప్రసిద్ధ 'లండన్ ఐ' తరహాలో దీనిని కృష్ణా నది తీరాన నిర్మించడానికి సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఈ భారీ చక్రం పైకి వెళ్లినప్పుడు పర్యాటకులు అందులో కూర్చుని అమరావతి నగరాన్ని, నది అందాలను చుట్టూ ఉన్న పరిసరాలను చాలా ఎత్తు నుండి స్పష్టంగా చూడవచ్చు. ఇందు కోసం టెండర్లు ఆహ్వానించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఇక.. అధికారిక అజెండా పూర్తయిన తరువాత మంత్రులకు సీఎం చంద్రబాబు రాజకీయ అంశాల పైన పలు దిశా నిర్దేశం చేసారు.













Click it and Unblock the Notifications