భారత్ 'డ్రోన్ ఆర్మీ' వచ్చేస్తోంది.. ఇవి ఎవ్వరి మాటా వినవు..!
భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాతో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. గతేడాది భారత్ లోని ప్రశాంతమైన కాశ్మీర్ లోయలో పాకిస్థాన్ ఉగ్రవాదులు చొరబడి 26 మందిని కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ కు చైనా ఆయుధాలు సరఫరా చేసిన విషయం తెలిసిందే. కానీ వాటిని భారత్ క్షిపణులు ధ్వంసం చేశాయి. ఇలా భారత్ పై అనేక అంశాల్లో పాకిస్థాన్, చైనా విషం చిమ్ముతున్నాయి.
ఈ నేపథ్యంలోనే భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. భారత వాయి సేన కోసం రూ. 3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 114 రఫేల్ విమానాలను కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్ ప్రభుత్వానికి భారత్ అధికారిక అభ్యర్థన లేఖ పంపింది. అయితే ప్రస్తుతం సాంకేతికత విపరీతంగా పెరిగిపోయింది. యుద్ధంలో డ్రోన్ ల వినియోగం రెట్టింపు అయింది. ఇటీవల భారత్- పాకిస్థాన్ యుద్ధంలో భారత్ పై పాకిస్థాన్ .. టర్కీ పంపించిన డ్రోన్ లను ప్రయోగించింది.
అలాగే రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలోనూ డ్రోన్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో డ్రోన్ సైన్యంపై భారత్ దృష్టి సారించింది. రఫేల్, ఎఫ్-35 యుద్ధ విమానాలు సాధించలేని అనేక లక్ష్యాలను డ్రోన్ లు సునాయాసంగా ఛేదిస్తున్నాయి. దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అలాగే స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ డ్రోన్ ఆర్మీని సిద్ధం చేస్తోంది. దీనికోసం సుమారు రూ. 19 వేల కోట్లకుపైగా విలువైన రక్షణ రంగానికి సంబంధించిన అతిపెద్ద మిలిటరీ డ్రోన్ ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధం అవుతోంది.

విశేషం ఏంటంటే.. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ సైనిక డ్రోన్లన్నీ భారత్ కు చెందిన దేశీయ రక్షణ ఉత్పాదక సంస్థల నుంచే సేకరించనున్నారు. ఇది భారత రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని, స్వయంసమృద్ధిని పెంచడమే కాకుండా దేశీయంగా ఉన్న 100 కు పైగా డిఫెన్స్ డ్రోన్ స్టార్టప్ లకు, కంపెనీలకు భారీ ఆర్థిక ఊతాన్ని ఇవ్వనుంది. ఇక డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ స్మిత్ షా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డ్రోన్ ఆర్మీ కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. రానున్న రెండేళ్లలో ఇవి సమకూరనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications