దొంగతో పోలీస్ కూతురు లవ్: పెళ్లిలో 'దొంగ' భర్త హామీ

సదరు పోలీసు ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అయితే ధోలాపుర్‌లో తన కూతురును కొందరు దొంగలు వేధిస్తుండటంతో పదిహేను దొంగతనం కేసులు ఉన్న మరో దొంగకు కూతురును అల్లరి మూకల నుండి రక్షించాలని సహాయం కోరాడు. ఆమె వేధింపుల నుండి బయటపడి గజదొంగతో ప్రేమలో పడింది.
ఆమె ప్రేమను పోలీసు తండ్రి ఎంతకూ అంగీకరించలేదు. కూతురు కూడా తన ప్రయత్నాలు విడువలేదు. క్రమంగా వారు పెళ్లికి ఒప్పుకున్నారు. దీంతో ఇటీవల పెరోల్ పైన విడుదలైన సదరు గజదొంగతో పోలీసు కూతురు వివాహం జరిగింది. కాగా మళ్లీ దొంగతనాలు చేయనని, బుద్ధిగా బతుకుతానని సదరు గజదొంగ తన భార్యకు హామీ ఇచ్చాడు.












Click it and Unblock the Notifications