తెలంగాణపై నెలాఖర్లో: డిఎల్, కావూరి నో కామెంట్

తెలంగాణ అంశంపై కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన అఖిల పక్ష సమావేశంపై వ్యాఖ్యానించడానికి కాంగ్రెసు అసంతృప్త పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు నిరాకరించారు. మీడియా సిబ్బంది అఖిల పక్ష సమావేశంపై ప్రశ్నిస్తే నో కామెంట్ అంటూ స్పందించారు. ఈ విషయంపై ఇప్పటికే చాలా సార్లు మాట్లాడానని ఆయన అన్నారు. ఢిల్లీలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు కమల్‌నాథ్, సుశీల్ కుమార్ షిండేలను ఆయన గురువారం కలిశారు. అన్ని విషయాలు జనవరిలో చెపుతానని ఆయన అన్నారు.
కాగా, తెలంగాణ ప్రాంతంలో పాదయాత్రలు చేస్తున్న పార్టీల నేతలు తాము తెలంగాణకు అనుకూలమని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్‌రావు డిమాండ్ చేశారు. గురువారంనాడు ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
అఖిల పక్షం డిమాండ్ చేసిన పార్టీలు ఇప్పుడు తమ వైఖరులను మార్చుకుంటున్నాయని ఆయన విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైఎస్ విజయమ్మ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై తెలంగాణకు అనుకూలమని చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications