హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు మారాడా, గతం వెంటాడుతోందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో తాను పూర్తిగా మారిపోయానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు సేవ చేయడం తప్ప తనకు మరే కోరికా లేదని చెబుతున్నారు. రెండు పర్యాయాలు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఈసారి తప్పకుండా అధికారంలోకి రావాల్సిన అనివార్యతలో పడింది. అన్నీ తానే అయి పార్టీని నడిపిస్తున్న చంద్రబాబుకు పార్టీని గెలిపించాల్సిన బాధ్యతను కూడా తానే తీసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు.

బాబు మారాడా, గతం వెంటాడుతోందా?

తెలుగుదేశం పార్టీని తిరిగి పైకెత్తాల్సిన బరువునంతా చంద్రబాబు నాయుడు ఒక్కరే మోస్తున్నారు. పార్టీ ఓడినా, గెలిచినా ఆయనదే బాధ్యత. అందుకే, ఆయన తన పాదయాత్ర ద్వారా ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

బాబు మారాడా, గతం వెంటాడుతోందా?

చంద్రబాబు తన పాదయాత్రలో ఇలా ప్రజల్లో కలిసిపోతున్నారు. మొత్తం తన శైలిని మార్చుకున్నారు. వారిలో తానూ ఒక్కడిని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

బాబు మారాడా, గతం వెంటాడుతోందా?

పాదయాత్రలో ఇలా ఇస్త్రీ పెట్టె పట్టారు కూడా. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ఇటువంటి చర్యను ఓ పనిగా పెట్టుకున్నారు. వారితో కలిసిపోతూ వారి కడగండ్లను వింటున్నారు.

బాబు మారాడా, గతం వెంటాడుతోందా?

చంద్రబాబును ఇలా చూడడం నిజంగా విచిత్రమే. పిల్లలతో ముచ్చటిస్తూ కనిపిస్తున్నారు. వారికి ఓటు హక్కు ఉందా, లేదా అనే ఆలోచన కూడా ఆయనకు లేదు. ప్రజల్లో కలిసిపోవడం ఒక్కటే ధ్యేయంగా నడుస్తున్నారు.

బాబు మారాడా, గతం వెంటాడుతోందా?

మేకపిల్లను పట్టుకోవడానికి ఆయన అభ్యాసం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. బాబు మా మనిషి అని ప్రజలు అనుకునేలా చేస్తున్నారు.

బాబు మారాడా, గతం వెంటాడుతోందా?

చంద్రబాబు ప్రజలతో కలిసి భోజనాలు చేయడమే కాదు, వారితో చేయిస్తున్నారు. ఆహారం, ఆరోగ్యం విషయంలో పట్టింపులను ఆయన వదిలేశారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని కూడా ఆయన ప్రజల వద్దకు వెళ్లే క్రమంలో మార్చేసుకున్నట్లు కనిపిస్తున్నారు.

బాబు మారాడా, గతం వెంటాడుతోందా?

వివిధ వృత్తులకు చెందిన ప్రజలను ఆయన ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా కల్లు గీత కార్మికులు చైతన్యవంతులు. వారిని తన వైపు తిప్పుకోవడానికి ఇలా కల్లు కూడా గీశారు.

గతంలో చంద్రబాబు రెండు రూపాయలకు బియ్యం పథకం ధరను ఐదు రూపాయలకు పెంచడం వంటి చర్యలు ఆయనను ఇంకా వెంటాడుతున్నట్లే కనిపిస్తున్నాయి. వ్యవసాయంపై చేసిన వ్యాఖ్యలు, సాఫ్ట్‌వేర్ సావీగా పేరు సంపాదించుకోవడానికి చేసిన ప్రయత్నాలు, సంక్షేమ పథకాలను విస్మరించడం వంటివి ఇంకా అవి వెన్నాడుతున్నట్లే కనిపిస్తున్నాయి. వాటిని ప్రజలు మరిచిపోకుండా వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు పార్టీలు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాయి. పైగా, చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మబోరనే ధీమాతో ఆ పార్టీలు ఉన్నట్లు కూడా అనిపిస్తోంది.

ఇప్పుడు ప్రజలను నమ్మించాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది. నిజంగానే ఆయన ప్రజలకు మేలు చేయాలనే అనుకుంటూ ఉండవచ్చు. కానీ, చంద్రబాబును ప్రజలు నమ్మేదెలా అనేది ప్రశ్న. అయితే, పాదయాత్ర కారణంగా ఇప్పటికే ప్రజా సమూహాల్లో మార్పు వచ్చిందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. పరిపాలనాపరంగా చంద్రబాబును తప్పు పట్టేవారు లేరు. కానీ, ఇబ్బందంతా సంక్షేమ పథకాల విషయంలోనే వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజలు తనను నమ్మేలా చేయడానికి ఈ పాదయాత్ర సరిపోతుందా, ఇంకా మరేదైనా వ్యూహరచన చేయాల్సి ఉంటుందా అనేది ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన సమయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

English summary
According to political analysts - Telugudesam president N Chandrababu naidu is facing the problem of past. He is trying win the confidence of people with his vastunna.. Meekosam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X