ఇంత చెత్త సినిమా అనుకోలేదుగా.. రూ.1400 కోట్లు బొక్క !!

సినిమా పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు విఫలమవడం కొత్త విషయం కాదు. కానీ కొన్ని సినిమాలు మాత్రం కేవలం ఫ్లాప్‌లుగా కాకుండా, నిర్మాతలకు ఊహించని విధంగా వందల కోట్ల నష్టాన్ని మిగిల్చి పరిశ్రమ చరిత్రలోనే చెత్త ఉదాహరణలుగా నిలుస్తాయి. ఇప్పుడు అలాంటి జాబితాలో చేరిపోయింది సౌదీ అరేబియా, బ్రిటన్, హాలీవుడ్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా 'డెసర్ట్ వారియర్'. ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద దారుణంగా కుప్పకూలి హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద కమర్షియల్ డిజాస్టర్‌లలో ఒకటిగా మారింది.

రూపెర్ట్ వ్యాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత జెర్మీ బోల్ట్ నిర్మించారు. 'కెప్టెన్ అమెరికా' ఫేమ్ ఆంథోనీ మాకీ, ఐషా హార్ట్, షార్ల్టో కోప్లీ, బెన్ కింగ్స్లీ వంటి అంతర్జాతీయ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. 7వ శతాబ్దపు అరేబియా నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా కోసం దాదాపు 150 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు ₹1,400 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు హాలీవుడ్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

desert-warrior-movie-worth-budget-of-1400-crores-but-collected-only-6-crores-world-wide

అయితే విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 4.72 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. భారత కరెన్సీలో ఇది సుమారు ₹6 కోట్లకు సమానం. అంటే పెట్టిన బడ్జెట్‌లో ఒక్క శాతం కూడా తిరిగి రాలేదన్న మాట. భారీ విజువల్స్, అంతర్జాతీయ స్థాయి తారాగణం, హాలీవుడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సినిమా పూర్తిగా విఫలమైంది. ఈ సినిమా నిర్మాణ దశ నుంచే సమస్యలు మొదలైనట్లు సమాచారం. షూటింగ్ పూర్తయ్యాక కూడా 'డెసర్ట్ వారియర్' చాలా కాలం పోస్ట్ ప్రొడక్షన్‌లోనే నిలిచిపోయింది.

దర్శకుడు రూపెర్ట్ వ్యాట్‌కు, నిర్మాణ సంస్థకు మధ్య సృజనాత్మక విభేదాలు తీవ్ర స్థాయికి చేరినట్లు హాలీవుడ్ మీడియా పేర్కొంది. కథనంలో మార్పులు, పాత్రల ఎడిటింగ్, యాక్షన్ సన్నివేశాలపై విభేదాల కారణంగా సినిమాను పలుమార్లు రీ-షూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరికి బయటి ఎడిటర్‌ను తీసుకువచ్చి మొత్తం చిత్రాన్ని మళ్లీ కట్ చేయించారని టాక్ వినిపిస్తోంది. దీంతో దర్శకుడు మొదట అనుకున్న కథకు, ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫైనల్ వెర్షన్‌కు భారీ తేడా వచ్చిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కథలో స్పష్టత లేకపోవడం, భావోద్వేగాల లోపం, నెమ్మదైన స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి.

ఇక ప్రమోషన్స్ విషయంలోనూ సినిమా బృందం పెద్దగా దృష్టి పెట్టలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ స్థాయి బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాకు అవసరమైన హైప్ క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలమయ్యారు. ట్రైలర్లు, ప్రమోషనల్ ఈవెంట్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు అన్నీ చాలా పరిమితంగానే సాగాయి. ఫలితంగా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడలేదు. సినిమా విడుదలైన తర్వాత విమర్శకుల నుంచి కూడా తీవ్ర ప్రతికూల స్పందన వచ్చింది.

"విజువల్స్ మాత్రమే ఉన్న ఖాళీ సినిమా", "భారీ బడ్జెట్‌తో నిర్మించిన కానీ ఆత్మలేని కథ", "సాంకేతికంగా గొప్పదైనా భావోద్వేగంగా పూర్తిగా విఫలమైన చిత్రం" అంటూ పలు అంతర్జాతీయ వెబ్‌సైట్లు రివ్యూలు ఇచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా మీమ్స్‌కు కేంద్రంగా మారింది. ఇప్పటికే హాలీవుడ్‌లో భారీ నష్టాలు మిగిల్చిన కొన్ని చిత్రాలు ఉన్నప్పటికీ, 'డెసర్ట్ వారియర్' మాత్రం అత్యంత తక్కువ వసూళ్లు సాధించిన భారీ బడ్జెట్ చిత్రంగా ప్రత్యేకంగా నిలిచింది. సౌదీ అరేబియా అంతర్జాతీయ సినిమా మార్కెట్‌లో తన ప్రభావాన్ని పెంచేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కావడంతో ఈ ఫెయిల్యూర్ మరింత చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+