పక్కా కొలతలతో ఆవకాయ పచ్చడి.. ఇలా చేస్తే మామిడికాయ ముక్క గట్టిగా, సూపర్ టేస్టీగా!

వేసవికాలంలో అందరూ ఇష్టంగా చేసుకునే రుచికరమైన పచ్చడి ఆవకాయ పచ్చడి . ఇంట్లో తయారు చేసుకునే రుచికరమైన మరియు దీర్ఘకాలం నిల్వ ఉండే ఆవకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలి? పక్కా కొలతలతో మామిడికాయ నిల్వ పచ్చడి ఇలా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా చెయ్యాలో సింపుల్ టిప్స్ తో తెలుసుకుందాం.

ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్ధాలు కొలతలతో

మామిడికాయలు.. ఒక కేజీ మామిడికాయ ముక్కలకు

ఆవపిండి : 1 కప్పు (100-120 గ్రాములు)

కారం పొడి : 1 కప్పు (100-120 గ్రాములు) – మంటకు తగ్గట్టు సర్దుబాటు చేసుకోవచ్చు

ఉప్పు (కల్లుప్పు పొడి): 1 కప్పు (100-120 గ్రాములు)

పల్లీ నూనె / నువ్వుల నూనె: 2 కప్పులు (సుమారు 300-400 ml)

వెల్లుల్లి రెబ్బలు (పొట్టు తీసినవి): అర కప్పు లేదా ఇష్టాన్ని బట్టి

మెంతులు: 1 టీస్పూన్ (ఆప్షనల్)

Avakaya Pachadi with perfect Measurements Make it This Way for Super-Tasty Mango Pickle

తయారీ విధానం

ఆవకాయ పచ్చడి తయారీకి ముందుగా మామిడికాయలను బాగా కడిగి, పూర్తిగా ఆరబెట్టుకోవాలి. తడి అస్సలు ఉండకూడదు. చిన్న చిన్న ముక్కలుగా కోసి, లోపల తెల్లటి జీడి పొరను పూర్తిగా తీసివేయాలి. ఈలోగా ఆవకాయ పచ్చడిలోకి కావాల్సిన మసాలాలు తయారు చేసుకోవాలి. ఆవాలు దోరగా వేయించి, చల్లార్చి పొడి చేసుకోవాలి. తాజా పొడి వాడటం వల్ల రుచి బాగుంటుంది. అందులోనే కొద్దిగా మెంతులు కూడా వేసి వేయించుకోవచ్చు.

పచ్చడి ఇలా కలిపితే టేస్ట్

ఒక పెద్ద బేసిన్ లో మామిడికాయ ముక్కలు వేసి ముందుగా అందులో కొంత నూనె వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా చేస్తే ముక్క చాలాకాలం గట్టిగా ఉంటుంది. ఆపై ఆవపిండి, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలపాలి. అన్ని పదార్థాలు ముక్కలకు సమానంగా పట్టేలా కలుపుకోవాలి. తరువాత ముక్క మునిగేవరకు నూనె పోసి బాగా కలుపుకోవాలి.

ఇంటి ఆవకాయ పచ్చడి రుచే వేరు

ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గాజు జాడీలోకి బదిలీ చేసి, మూత పెట్టి 3 రోజులు గది ఉష్ణోగ్రతలో ఊరబెట్టాలి. 3 రోజుల తర్వాత ముక్కలు బాగా ఊరి, నూనె పైకి వస్తుంది. అవసరమైతే మరికొంత నూనె వేడి చేసి చల్లార్చి జాడీలో పోయాలి. ఈ కొలతలతో చేస్తే మీ ఆవకాయ దీర్ఘకాలం నిల్వ ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకున్న ఆవకాయ రుచి ఎప్పుడూ మార్కెట్ ఆవకాయకు భిన్నంగా ఉంటుంది.

ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు ముఖ్యమైన చిట్కాలు

మామిడికాయ ముక్కలు పూర్తిగా పొడిగా ఉండాలి. తడి ఉంటే పచ్చడి చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆవకాయ పచ్చడికి పల్లీ నూనె వాడితే రుచి మరింత బాగుంటుంది. ముక్కలకు ముందుగా నూనె పట్టిస్తే ముక్క మెత్తబడకుండా చాలాకాలం పాటు ఉంటుంది. ఉప్పు, కారం మంచి నాణ్యత ఉన్నవి వాడితే మంచిది. ఇవి పచ్చడి రుచిని పెంచడంతోపాటు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తాయి. ఆవకాయ పచ్చడి జాడీని ఎప్పుడూ తడి స్పూన్‌తో తాకకూడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+