సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న అషు రెడ్డి..
సోషల్ మీడియా సెన్సేషన్, తెలుగు బ్యూటీ "అషూ రెడ్డి" గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా టిక్‌టాక్ వీడియోల ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ కూడా ఇచ్చింది. హౌస్‌లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయినా కానీ.. షో తర్వాత కూడా ఆమె ఏ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెకు విపరీతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. అలా యాంకర్‌గా, నటిగా బిజీగా ఉన్న అషు రెడ్డి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోషూట్స్, వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
కాగా అషురెడ్డిపై ఇటీవలే కేసు ఫైల్ అయ్యింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తన దగ్గర 9 కోట్ల 35 లక్షల రూపాయిలు కాజేసిందంటూ లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ధర్మేంద్ర హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.మోసం చేశారనే ఆరోపణలతో అషురెడ్డితో పాటు ఆమె తల్లి యశోదరెడ్డిపై ఉన్న సంగతి తెలిసిందే. తమపై నమోదైన ఈ కేసు దర్యాప్తును నిలిపివేయాలని (స్టే ఇవ్వాలని) కోరుతూ వారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం వారికి గట్టి షాక్ ఇచ్చింది.

దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అంతేకాకుండా విచారణ సమయంలో పోలీసుల కఠిన చర్యల నుంచి తమకు మినహాయింపు (ముందస్తు రక్షణ) కల్పించాలన్న వారి అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ కేసు విచారణకు అషు రెడ్డి హాజరు కావలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ అనూహ్య పరిస్థితుల్లోనే తాజాగా సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసింది అషు రెడ్డి.
ఎవరూ ఊహించని విధంగా తనకు 'ఎంగేజ్మెంట్' అయిపోయిందంటూ ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఫొటోలు షేర్ చేస్తూ కెమెరా ఎమోజీ తప్ప మరే క్యాప్షన్ పెట్టకపోవడం గమనార్హం.. అయితే అషు రెడ్డికి నిజంగానే నిశ్చితార్థం జరిగిందా.? లేక ఏదైనా మూవీ షూటింగ్ లో స్టిల్స్ షేర్ చేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరిని అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!












Click it and Unblock the Notifications