తెలుగు మహాసభలు యధాతథం, వేదిక మార్పు

తిరుపతిలో వర్షాల కారణంగా ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న మహాసభల నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఈ సమీక్ష సమావేశానికి ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ నెల 27 నుంచి 29 వరకు మహాసభలు జరుగుతాయి. తిరుపతిలో మహాసభలకు కేటాయించిన స్థలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ చిత్తడి నెలకొంది. దీంతోస మావేశాలను వాయిదా వేయాలని ముందు అనుకున్నప్పటికీ గురువారం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి తేదీలు వాయిదా వేయవద్దని, వేదిక మార్చి సభలు నిర్వహించాలని సూచించారు.
దాంతో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్, తారాకరామ గ్రౌండ్స్‌ను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై సమీక్షించిన ప్రభుత్వం ఈ సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అవిలాల చెరువులో పెద్దఎత్తున నీరు చేరింది. తెలుగు సభలకోసం సిద్ధం చేసిన 90 ఎకరాల స్థలంలో చాలాభాగం నీటితో నిండిపోగా, మిగిలిన ప్రాంతంవాహనాల రాకపోకలు సాగించడానికి వీలు లేనంత చిత్తడిగా మారింది.
దీంతో అనుకున్న సమయానికి (డిసెంబర్ 27నుంచి29 వరకు) ఇక్కడ సభలు నిర్వహించానికి వీలుకాదని సభాస్థలి ఏర్పాట్ల బాధ్యత చేపట్టిన టీటీడీ ఇంజనీరింగ్ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అవిలాల చెరువులో ఇప్పుడు వేదికలు నిర్మించడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడమే మంచిదని ఇంజనీర్ల బృందం ప్రభుత్వానికి నివేదించింది. దీంతో వేదిక స్థలాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications