వైయస్ జగన్ పార్టీ ఎంపీ, కొడుకుపై చీటింగ్ కేసు

Mekapati Rajamohan Reddy
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి పైన మోసం కేసు నమోదయింది. ఈ కేసు ఆగస్టు 9వ తేదిన నమోదైంది. ఆలస్యంగా బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. అద్దంకి నుంచి నార్కట్‌పల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులను మేకపాటి రాజమోహన్ రెడ్డి వద్ద సనత్ కుమార్ రెడ్డి అనే సబ్ కాంట్రాక్టర్ ఏడాది కిందట తీసుకున్నారు.

ఆ పనులు పూర్తైనా సనత్ కుమార్ రెడ్డికి డబ్బులు చెల్లించాల్సిన నగదును ఇవ్వకుండా మేకపాటి వాయిదా వేస్తూ వస్తన్నారు. దీంతో నగదు చెల్లించక పోవడం, నమ్మించి మోసం చేశారంటూ సనత్ రెడ్డిజిల్లా కోర్టును ఆశ్రయించాడు. ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. వాదనలను విన్న జిల్లా కోర్టు మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు ఆయన తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి పైన కూడా చీటింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

దీంతో పోలీసులు మేకపాటి, ఆయన తనయుడు, మరో వ్యక్తి పైన నమ్మకద్రోహం, మోసం కింద కేసు నమోదు చేశారు. కాగా మేకపాటి రాజమోహన్ రెడ్డి గతంలో కాంగ్రెసు పార్టీ ఎంపీగా ఉన్నారు. కొద్ది నెలల క్రితం వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడంతో ఎంపీ పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+