చొక్కా పట్టుకొని అడగండి: షర్మిల, నగరంలో తలసాని

మద్దతు ధరపై పాలకులు స్పందించకుంటే వారిని చొక్కా పట్టుకొని నిలదీయాలని షర్మిల రైతులకు సూచించారు. పాడి, వ్యవసాయ రైతులను ఆదుకోవడంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కిరణ్ పాలన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాలనను తలపిస్తోందన్నారు. బాబు హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు వైయస్ స్వయంగా వచ్చి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారన్నారు.
కాగా షర్మిల పాదయాత్ర గురువారం జడ్చర్ల నుంచి ప్రారంభమైంది. గంగాపూర్, గోప్లాపూర్ క్రాస్, కోడగల్, మట్టపల్లి తండా, నల్లగుంట క్రాస్ రోడ్డు మీదుగా కొందేడుకు చేరుకుంటుంది. ఈ రోజు షర్మిల 18.7 కిలోమీటర్లు నడుస్తారు. రాత్రికి కొందేడు గ్రామంలో బస చేస్తారు.
సమస్యలపై తలసాని
హైదరాబాద్: నగరంలోని సమస్యలపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై సమర భేరీ మోగించనున్నారు. ప్రభుత్వం నగర సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయన ఈ నెల 8న సమర భేరీ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు.












Click it and Unblock the Notifications