భర్త హత్యకు భార్య సుపారి: ప్రియుడితో కలిసి ప్లాన్

Wife's supari for Husband's murder
బెంగళూరు: తన భర్తను హత్య చేసేందుకు ఓ భార్య సుపారీ ఇచ్చిన సంఘటన కర్నాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఓ మహిళ తన భర్తను హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి నలుగురు కిరాయి నిందితులను రంగంలోకి దించింది.

ఈ హత్య వివరాలను నగర పోలీస్ కమిషనర్ జ్యోతి ప్రకాశ్ మిర్జి బెంగళూరులో బుధవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్‌ను హత్య చేసేందుకు ఇరవై అయిదేళ్ల అతని భార్య మంగళ తన ప్రియుడు కిరణ్‌ కుమార్‌తో కలిసి పథకం వేసింది.

తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశ్యంతోనే కుమార్‌ను చంపాలని మంగళ నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన ప్రియుడికి తెలియజేసింది. కుమార్‌ను హతమార్చేందుకు ప్రియుడు కిరణ్, మంగళలు అని, దీపు, నాగేశ్‌లతో మూడు లక్షల రూపాయలకు కిరాయి ఒప్పందం కుదుర్చుకున్నారు.

పిల్లలను పాఠశాలలో వదిలి తిరిగి వస్తున్న కుమార్‌పై వీరంతా కలిసి నవంబర్ పందొమ్మిదవ తేదిన హనుమంత నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ బస్టాండ్ వద్ద కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+