మనవడు-మంత్రి: జగన్ వైపుకు సిగ్నలిచ్చిన కావూరి?

Kavuri Sambasiva Rao
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లేందుకు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు సిద్ధమయ్యారా? అంటే అవుననే అంటున్నారు. శుక్రవారం కావూరి ఆ దిశలో సంకేతాలు ఇచ్చినట్లుగానే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కేంద్రమంత్రి వర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో అతను అధిష్టానంపై అలిగాడు.

రాజీనామా, సభకు వెళ్లడం తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన చల్లబడ్డారనే వార్తలు వచ్చాయి. అయితే శుక్రవారం కొల్లేరు ఉద్యమం కోసం నడుం కట్టారు. ఈ సమయంలో ఆయన మార్టీ మార్పుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. తాను 45 ఏళ్లుగా కాంగ్రెసులో ఉంటున్నానని, కాంగ్రెసుతో తన బంధం విడదీయరానిదన్నారు. అదే సమయంలో విడదీసే పరిస్థితి వస్తే మాత్రం ఇతర పార్టీలోకి వెళ్లే విషయం ఆలోచిస్తే తప్పేంటన్నారు.

సొంత పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసినప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన చేస్తే తప్పేంటన్నారు. ఆయన వ్యాఖ్యలు పార్టీ మారే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయని అంటున్నారు. మంత్రి పదవిపై ఆయన కేబినెట్ విస్తరణ జరిగినప్పుడల్లా ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడూ చుక్కెదురవుతోంది. ఇప్పుడు అలక పాన్పు ఎక్కాడు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని కూడా చెప్పాడు.

కొత్తగా వచ్చిన వారిని అందలమెక్కించి తనను పోస్టర్లు అంటించమంటున్నారని, స్లోగన్లు ఇవ్వమంటున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం పార్టీలో తనకు ప్రాధాన్యం లేదని ఆయన చెప్పేశారు. ప్రాధాన్యం లేనప్పుడు వేరే పార్టీ వైపు వెళ్లే ఆలోచన చేస్తే తప్పేంటన్నారు. దీంతో గత కొన్నాళ్లుగా ఆయన జగన్ పార్టీలోకి వెళతారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. కొత్తగా వచ్చిన వారిని అంటే ఆయన కేంద్రమంత్రులు పురంధేశ్వరి, చిరంజీవిని ఉద్దేశించి అన్నారని అంటున్నారు.

తనను కాదని పురంధేశ్వరికి పదవి ఇవ్వడంపై ఆయన తొలి నుండి అసంతృప్తితో ఉన్నారు. అలాగే చిరంజీవికి బెర్త్ ఖాయమైందని గతంలో ఓసారి ప్రచారం జరిగినప్పుడు ఆయన అడ్డుకున్నారనే వార్తలు వచ్చాయి. ఇలా పురంధేశ్వరి, చిరుకు పదవులు ఇచ్చి ఎన్నో ఏళ్లుగా పార్టీ పట్ల అంకితభావంతో పని చేస్తున్న తనను విస్మరించడాన్ని ఆయన జీర్ణించుకులేక పోతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా ఆయన మనవడు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇలా మంత్రి పదవి రానందుకు కాంగ్రెసు పార్టీని వీడటం ద్వారా వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో తన మనవడి గెలుపుకు బాటలు పరుస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన జగన్ వైపుకు వెళ్తే మరింత ప్లస్ అవుతుంది. ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆ దిశలోనే ఉండటం గమనార్హం. అయితే ఆయన పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆయన వర్గం చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+